Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.03.2022
Share:

By Village Missionary Movement

Monday, 07-Mar-2022

దిన ధ్యానము(Telugu) 07.03.2022

అంశం:-  మంచి నేలలో పడిన విత్తనం.

"మరి కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను” - లూకా 8:8

ఒక సారి ఇద్దరు స్నేహితులు కలిసి వినోదంకోసం అడవికి వేటాడుటకు వెళ్లారు. అందులో ఒకడు వైద్యుడు ఒకతను సేవకుడు వారు అడవిలోనికి వెళుతుండగా ఒక ఎలుకుబంటి ఎదురు పడింది. మొదట ఇద్దరు భయపడ్డారు తరువాత కొంచం ఆలోచించుకొని దాగుకొని వారు తమ చేతులలోని తుపాకులు తీసుకొని ఎలుకబంటును ఓకేసమయంలో కాల్చారు. ఆ ఎలుకుబంటి క్రిందపడి చనిపోయింది. ఇద్దరు ఆ ఎలుకుబంటి దగ్గరకు వెళ్లి చూసారు. ఆ ఎలుకు బంటి గుండెల్లో ఒక తుపాకి గుండు, ఒక చెవిలో నుండి ఇంకొక చెవిలోనికి నుండి బయటికి వచ్చిన మరొక తుపాకీ గుండు చూసి ఏది తమ తుపాకీ గుండు అని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆ డాక్టర్ గుండెలోని వెళ్లిన గుండు నేను కాల్చినది ఎందుకంటే ప్రజలలోనికి నేను చెప్పినది నేరుగా వారి గుండెలలోనికి వెళుతుంది నేను చెప్పిన మాటలు నేరుగా వారి హృదయంలోనికి వెలుతుంది. నేను చెప్పేమాటలు వారి ప్రాణమునకు సంభందించినవి అవటంతో వాటిని అలాగే పాటిస్తున్నారు అని చెప్పాడు. సేవకుడు మాత్రం ఏమి చెప్పాలో తెలియక నిలబడి ఉన్న సమయంలో వైద్యుడు ఈ చెవిలోనికి ధూసుకు వెళ్లిన గండు మీరు కాల్చినది ఎందుకనగా ప్రజలకు మీరు చెప్పేది చెవినుండి లోనకి వెళ్ళదు అని చెప్పారు. 

అవును ప్రియమైన వారలారా! ఇది ఎంత నిజం మనము కూడా చాలా సమయాలలో పరిశుద్ధ గ్రంథ వాక్యం వింటున్నాం, చదువుతున్నాం కాని ఈ వాక్యం ద్వారా మనలో క్రియ జరిగి మార్పును తీసుకురావడానికి మనం చోటిస్తున్నమా? దీనినే ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉపమాన రీతిగా చెప్తున్నారు. కొంతమంది త్రోవపక్కన పడిన విత్తనములవలె వాక్యమును వినువారివలె ఉన్నారుకాని నమ్మట్లేదు కొంతమంది రాతి నేలమీద పడిన విత్తనములవలె ఉన్నారుకాని బలము అనే వేరులేక తొలగిపోవుచున్నారు. మరికొంత మంది ముండ్లపొదలవంటి సమస్యలు వచ్చినప్పుడు వెనుదిరిగిపోతున్నారు. కాని కొంతమంది మాత్రము మంచినేలపై విత్తబడిన వారి వాలె అరువదంతలుగా నూరంతలుగా ఫలిస్తున్నారని చాలా సమయాలలో మనము కూడా ఈవిధముగానే లోకరీతి అయిన  కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చి వాటినే ఆలోచిస్తూ పరిశుద్ధ గ్రంధంలోని వాక్యములను మరచిపోతున్నాం. కొంతమందికి ఆ వాక్యం చెవిలోనికి కూడా వెళ్ళటం లేదు. అందువలన మనం వీటిలో యే స్థితిలో ఉన్నామో అనేది గ్రహించి వాక్యము మనలో క్రియజరిగించు లాగున దానిని పూర్ణ హృదయముతో అంగీకరించి ధ్యానం చేసినట్లయితే మనం లోకమునకు ఆశీర్వాదకరంగా ఉంటాము. 
-    శ్రీమతి. ఎఫి రాక్సన్ గారు

ప్రార్ధనా అంశం:-
తోటి సేవకుల ద్వారా 5గ్రామాలలో జరుగుతున్న పరిచర్య కొరకు మరియు చర్చస్ లేని గ్రామాలలో చర్చస్ కట్టబడేటలు ప్రార్దిద్దాం. 

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş matbet matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet betgit radissonbet grandpashabet romabet nesinecasino grandpashabet casibom