By Village Missionary Movement
Thursday, 17-Mar-2022దిన ధ్యానము(Telugu) 17.03.2022
అంశం:- కన్నులను భద్రముగా చూసుకొనుము.
"తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును" - సామెతలు 30: 17
మనలను సృష్టించిన దేవున్ని సంతోష పరచడమే మన జీవిత ముఖ్య లక్ష్యం. పరిశుద్ద గ్రంధం ధ్యానించుట వలన దేవునికి ఏది సంతోషకరమో నేర్చుకోగలము. తండ్రిని తల్లిని సన్మానించడం అనేది 10 ఆజ్ఞ లలో మనం చూస్తున్నాం. సన్మానించుట అనేది హృదయం మొదలుకొని చెప్పుటలో, చేయుటలో కూడా వ్యక్త పరచాలి. తల్లిదండ్రులను సన్మానించుటలో ఒక చక్కటి ఉదహరణను సొలొమోను జీవితంలో చూడవచ్చు. 1 రాజులు 2:19లో తన తల్లి తనను చూచుటకు తన యొద్దకు వస్తున్నారు అని తెలుసుకొని రాజైన సొలొమోను లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు కూడా ఒక సింహాసనం వేయించుట చూస్తున్నాం. ఇలా సన్మానించు వారికి మేలును, దీర్ఘాయువు కలుగునని దేవుడు వాగ్దానం చేశారు.
ప్రియమైన వారలారా! తన తండ్రి నైనను, తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండం 27:16 వ వచనంలో చదువుతున్నాం. తల్లిదండ్రులను అపహసించి వారి మాటలను వినకపోతే అటువంటి వారి కన్నులను కాకులు పీకును అని సామెతలు 30:17లో మనం చదువుతున్నాం. అలా అయితే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2:11లో తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డి తనం కలుగజేసేను కనుక తానెక్కడికి పోవునో అతనికి తెలియదు అని చదువుతున్నాం. అవును పగ అనేది ఒకరిని ఆత్మీయ చీకటిలోకి త్రోసివేస్తుంది. జీవితంలో సమాధానము కోల్పోయేల చేసి గందరగోళం మరియు మనస్తాపం తీసుకువస్తుంది. తల్లిదండ్రుల మాటలు విననప్పుడు ఇదేవిధంగా జరుగుతుంది. అదే కన్నులను కాకులు పీకును అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది కదా. ప్రేమలో నడిచి తల్లిదండ్రులను సన్మానించి మన ఆత్మీయ వెలుగును కాపాడుకుందాం. మన కన్నులను భద్రంగా చూసుకొందాం.
- బ్రదర్. జె. సంతోష్ గారు
ప్రార్ధన అంశం:-
చైన్ ప్రేయర్ పరిచర్యలో పాలుపొంది ప్రార్ధించే కుటుంబములను దేవుడు హెచ్చించేలా ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250