Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.03.2022
Share:

By Village Missionary Movement

Friday, 18-Mar-2022

దిన ధ్యానము(Telugu) 18.03.2022

అంశం:-  మాయ మాయ.

"ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను" - లూకా 12:15

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు జాన్ మేకన్ డ్రో ఒకతను ఉండేవాడు. ఆ టెన్నిస్ వలన చాలా డబ్బు, పేరు సంపాదించాడు. తన 24వ సంవత్సరంలో చాలా గొప్ప ధనవంతుడిగా జాన్ ఉండేవాడు. ఒక సమావేశం లో అతనికి ఒక ప్రశ్న అడగబడింది. మీకు సవాల్ అనేది ఏదైనా ఉంటే అది మాకు చెబుతారా అని అడిగారు. కొంత సేవు నిశ్శబ్దంగా ఉన్న జాన్  నా యొక్క సవాల్ నేను ప్రతి రోజు ఎదుర్కొంటున్నాను అని అన్నాడు. ఆ సమావేశంలో ఉన్న అందరు ఆశ్చర్యంతో ఆ సవాల్ ఏమిటి అని అడిగారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ఆ సవాల్ నేనే అన్నారు అంట. కోట్ల కొలది డబ్బు ఉండటం వలన నేను అన్నింటినీ చేరుకున్నాను అని మీరు అనుకొనవద్దు అని చెప్పాడు. లూకా సువార్త 12 వ అధ్యాయంలో యేసుక్రీస్తు ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. పాపపు జాబితాలో ధనాపేక్ష గురించి చాల చోట్ల చెప్ప బడి ఉండుటను పరిశుద్ద గ్రంధంలో మనం చూస్తున్నాం. వస్తువులు అధికంగా ఉండుట వలన మనుష్యుడు అన్నింటినీ చేరుకొన్నాను అనుకొంటున్నారు. కాని ఇక్కడ విషయమే వేరు అని తరువాత అర్థం చేసుకొన్నాను. మనుష్యునికి ధనం పెరుగుతున్న కొలది వాడికి సమాధానము అనేది తగ్గిపోతుంది. చివరిలో అతని జీవితం ముగుస్తుంది. దీనినే సమస్తము మాయ అని చెబుతున్నారు. 

డబ్బు మనకు అవసరమే కాని అదే ఒక మనుష్యునికి సంపూర్ణ తృప్తిని ఇవ్వడం సాధ్యం కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌలు చెబుతున్నారు. దేవుడు అహంకారులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే లూకా సువార్త 12:15 లో ఒకనికి ఎంత ఆస్తి ఉన్న, అది వాని జీవమునకు మూలము కాదు అని చెబుతుంది. ఈ లోకము మాయతో నిండినది. అందువలన మనము కూడా  సొలొమోను వలె ఈ మాయా లోకంలో ధనాపేక్షను ద్వేషించి దేవుని చెంత చేరినప్పుడు మనకు సమాధానము మరియు విశ్రాంతి దొరుకుతుంది. వీటిని పొందుకొనుటకు మనము వినయముతో పరిగెడదాం. ఆమెన్.
-    బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు


ప్రార్థన అంశం:-
ఒక లక్ష గ్రామాలను సందించుటకు  ఒక లక్ష మంది వ్యక్తులు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort