By Village Missionary Movement
Saturday, 19-Mar-2022దిన ధ్యానము(Telugu) 19.03.2022
అంశం:- దినత్వం గల ఆత్మ.
"ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది" - మత్తయి 5:3
అమెరికా మాజీ అధ్యక్షుడుగా ఉన్న అబ్రహం లింకన్ యొక్క తండ్రి చెప్పులు కుట్టే వృత్తి చేసేవారు. ఈ వృత్తి వలన పరిపాలన కాలంలో ప్రతి పక్ష నేతగా ఉన్న ఒకతను లింకన్ ను అవమాన పరిచారు. ఒక రోజు శాసనసభ సమావేశంలో మీ నాన్న కుట్టి ఇచ్చిన చెప్పులనే ఇంకా వేసుకొంటున్నాను అని అన్నారు. వెంటనే లింకన్ అవునా మా నాన్న కుట్టి ఇచ్చిన చెప్పులు చాలా కాలం పని చేస్తున్నాయి చూడండి ఎప్పుడైనా ఒక రోజు అవి తెగిపోయినట్లు అయితే అవి నాకు ఇవ్వండి నేను కుట్టి ఇస్తాను. నేను అధ్యక్షుడిగా ఉన్నా సరే నాకు చెప్పులు కుట్టడం వచ్చు అని వినయముగా చెప్పారు లింకన్. అతని హృదయంలో కనబడిన దీనత్వం గల ఆలోచనను చూడండి.
2వ సమూయేలు 6వ అధ్యాయం 11-22 వచనాలు చదివినట్లు అయితే దావీదు రాజు యెహోవా మందసమును ఓబేదెదోము ఇంటినుండి దావీదు పురమునకు తీసుకొని వస్తున్నప్పుడు దావీదు తన శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం చేశారు. ఈ సంఘటనను సౌలు కుమార్తె అయిన మరియు దావీదు భా భార్య మీకాలు కిటికీ నుండి చూసి తన మనస్సులో అతనిని హీనపరచింది. మీరు రాజువలె నడుచుకున్నారా? కాదు మీరు హీనస్థితిలో ఉన్న వ్యర్థునిగా నడుచుకున్నారు అని అతని గురించి అసహ్యంగా మాట్లాడింది.
దావీదు మాత్రం భార్య యొక్క ఈ మాటలకు కఠినమైన శిక్ష లేదా దండనను విధించ వచ్చు కాని అతను భర్త, రాజు అనే అర్హతల ద్వారా తీర్పు తీర్చకుండా తనను తాను తగ్గించు కొన్నారు. ఇంత కంటే నేను మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనైతిని అన్నారు. ఇది సాధారణమైన మాట కాదు తన ఆత్మలో ఉన్న దీనత్వమును సూచిస్తుంది. నేను రాజును అని ప్రతి నిమిషం తనలో తాను జ్ఞాపకం చేసుకొంటూ ఉండకుండా దేవుని ముందు తాను ఎవరు అతని ఆత్మలో ఏరిగినవాడైయున్నారు. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు .
ప్రియమైన వారలారా! మరి మీ పరిస్థితి ఏమిటి ఇతరుల ముందు అవమానించబడినప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? ఇతరుల ముందు అవమాన పరచబడుట, హీన పరచ బడుట అనేది కష్టతరమే. కాని అవమానము అంగీకరించి ఆ స్థలములో దీనత్వము గల ఆత్మతో ఉన్నప్పుడు ఒక పరిపక్వము గల అనుభవమే. ఎల్లప్పుడు మన ఆత్మ ఆలోచన, తలంపు, దీనత్వమును కలిగి తగ్గించుకొని ఉండాలి. నిశ్చయంగా మనం యెహోవా దృష్టికి ధన్యులమే. పరలోక రాజ్యము మనదే.
- శ్రీమతి. రూత్ అనిష్ గారు
ప్రార్ధనా అంశం:-
7000 మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలు సందింప బడాలి అనే ప్రణాళికకు సమర్పించు కొనిన సేవకులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250