By Village Missionary Movement
Sunday, 20-Mar-2022దిన ధ్యానము(Telugu) 20.03.2022 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
అంశం:- నమ్మదగిన దేవుడు.
"యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును" - యిర్మియా 17:7
యేసు నామంలో మీకు నా వందనములు పిల్లలు. కథ వినడానికి రెడీగా వున్నట్టు ఉన్నారు? వినడం మాత్రమే కాదు దాని ప్రకారమే జీవించుటకు ప్రయత్నించాలి ఒకే నా!
ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఆ దేశ సైన్యంలో సైనికులుగా ఉండేవారు. అందులో ఒకరు యేసుని ఎరుగని వారు ఒకరు యేసుని ఎరిగిన వారు మరిఒకరు. యుద్ధంలో వీరి సైన్యం ఒడిపోవుట వలన శత్రువు వీళ్ళను పట్టుకొనుటకు వెంటాడుతున్నారు. చాలా దూరం వెళ్లిన తరువాత యేసయ్యను నమ్ముకొనిన స్నేహితుడు కనబడలేదు. ఆయన తన శత్రువులకు దొరికిపోయి ఉంటాడు అని బాధతో మాట్లాడుతున్నప్పుడు యేసుని ఎరుగని స్నేహితుడు నా స్నేహితుడు క్షేమముగా వచ్చి మన సైన్యంలో చేరుకుంటాడు అని చెప్పాడు. ఇంత నిశ్చయముగా ఎలా చెప్పగలగు తున్నావు అని అడిగారు. అందుకు అతను నా స్నేహితునికి యేసయ్య తెలుసు ఆయన నా స్నేహితుడ్ని భద్రముగా కాపాడతారు అని నమ్మకంతో చెప్పాడు. శత్రువు వెంటాడి రావడంతో వారు అడవిలోకి పోయి ఒక గుహలో దాక్కొన్నాడు. యేసయ్య నేను నమ్మదగిన దేవుడవు మీరే అని ప్రార్ధనా చేసి లోపల దాక్కొని ఉన్నాడు. అక్కడకు వచ్చిన శత్రు సైన్యం ప్రతి గుహలో శత్రు దేశ సైన్యం దాక్కొని ఉండవచ్చు అనుకోని ఆ గుహలోకి కాలుస్తూనే ఉన్నారు. ఆ సైనికుడు దాక్కొని ఉన్న గుహ పక్కకు వచ్చినప్పుడు సైన్యం యొక్క నాయకుడు ఆపండి తుపాకీ గుండ్లను వృధా చెయ్యకండి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడంతో అందరూ ఆ స్థలమును విడిచి వెనుదిరిగి వెళ్లిపోయారు. యేసయ్య తనను కాపాడిన అతిశయమును తలంచి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పాడు ఆ సైనికుడు. అవును యేసయ్యను నమ్మిన వారిని ఆయన ఎన్నడు చేయి విడువడు.
ప్రియ తమ్ముడు చెల్లి, మీరు కూడా అపత్తు సమయంలో సహయమును వేతుకుతున్నప్పుడు 100% నమ్మకంతో యేసయ్యను పిలవండి. ఆయన మాత్రమే మిమ్మల్ని కాపాడుటకు మరియు మీకు సహాయము చేయుటకు శక్తిమంతుడై యున్నారు. పిల్లలు నమ్మదగిన దేవుడు మీతో ఉన్నప్పుడు మీకెందుకు భయం.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250