By Village Missionary Movement
Sunday, 20-Mar-2022దిన ధ్యానము(Telugu) 21.03.2022
అంశం:- తిరస్కరణ మంచిది.
"అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను" - ఆదికాండము 45:5
నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ కు భోజనం చెయ్యడానికి వెళ్లారు. అప్పుడు అక్కడ ఒకతను ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని చాలా భయంతో వణుకుతూ భోజనం చేస్తున్నాడు. ఆ అధ్యక్షుని యొక్క కాపలా దారులు అతనిని గమనించి నెల్సన్ మండేలా కు తెలియ జేసారు. నెల్సన్ అతనిని చూసారు ఆ వ్యక్తి యొక్క ముఖంలో సన్నని చిరునవ్వు నేను చెరసాలలో ఉన్నప్పుడు అతనే నా చెరసాలకు కాపలదారుడు. ఒకసారి నేను అతనికి నీళ్లు అడిగినప్పుడు అతను నా ముఖము మీద మూత్ర విసర్జన చేశారు. ఇప్పుడు నేను విడుదలయ్యాను అందుకే నేను అతని పైన పగ తీర్చుకొంటాను అనే భయంతో వణుకుతున్నాడు అన్నారు. అతనిని చూసి చిన్న చిరునవ్వుతో లేచి వెళ్లిపోయారు.
పరిశుద్ద గ్రంధంలో యోసేపు సహోదరులు యోసేపును 20 వెండి కాసులకు అమ్మివేసారు. ఐగుప్తులో ఫోతిఫర్ భార్య వలన చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు తన 30 సంవత్సరాల వయస్సులో ఐగుప్తు దేశ అధిపతిగా హెచ్చింపబడ్డాడు. అప్పుడు యోసేపు సహోదరులు ఉన్న దేశంలో ధాన్యం కరువు వచ్చినందున తన సహోదరుడైన యోసేపు ఐగుప్తు అధిపతి అని తెలియక ధాన్యం కొనుటకు ఐగుప్తుకు వెళ్లారు. వారిని చూసిన వెంటనే యోసేపు వారు తన సహోదరులు అని పోల్చాడు. యోసేపునకు తన సహోదరులపై పగ తీర్చుకోవాలి అనే ఆలోచన లేదా వారిని తిరస్కరించాలి అనే ఆలోచన యోసేపునకు లేదు. కాని యోసేపును తన సహోదరులు పూర్తిగా తిరస్కరించి అమ్మేశారు. పగ తీర్చుకొనే స్వభావము ఒకనిలో లేదా ఒక దేశములో ఉన్నట్లు అయితే పైకి ఎదగలేరు. అందరిని ఓదార్చి చేర్చుకునే స్వభావం ఒకరిలో ఉన్నట్లు అయితే ఒక సామ్రాజ్యమును సృష్టించవచ్చు. ఇదే స్వభావం యోసేపులో ఉండేది.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మిమ్మల్ని ఎవరైనా తిరస్కరించిన బాధపడవద్దు. చాలా మంది ప్రజలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయలేక తిరస్కరిస్తారు. పగ తీర్చుకొనే స్వభావము లేని వారమైన ఉన్నట్లు అయితే కచ్చితంగా దేవుడు మనలను తిరస్కరించ కుండా హెచ్చిస్తారు. ఆమెన్.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు.
ప్రార్ధన అంశం:-
సేవకుల కొరకు ప్రత్యేకంగా వ్రాయబడి అందజేయుటకు మాస పత్రికలు ముద్రించ బడేటట్లు ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250