By Village Missionary Movement
Tuesday, 22-Mar-2022దిన ధ్యానము(Telugu) 22.03.2022
అంశం:- స్వల్పమైన శ్రమ.
"మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను" - రోమీయులకు 8:18
రెండవ ప్రపంచ యుద్ధం విజయమునకు అమెరికా సైన్యం యొక్క నాయకుడు అయిన జెనరల్ ఐసెన్ హెవర్ ముఖ్య పాత్ర వహించారు. అతడు మొట్ట మొదటిగా సైనిక శిక్షణలో చేరినప్పుడు అక్కడ పడే కష్టములను ప్రతి రోజు తన తల్లికి లేఖలో రాసేవాడు.అందులో ఇలా ఉంది తెల్లవారి 4గంటలకు నిద్రలేవాలి. ప్రతి రోజు 20 కిలోమీటర్లు పరిగెత్తాలి. సుమారు 40-45 డిగ్రీల వేడిగల ఎడారి ప్రాంతంలో శిక్షణ పొందుతున్నప్పుడు దొరికే ఆహారం 100ml పాలు మాత్రమే. ఈ విధముగా తన యొక్క శిక్షణలో ఆయన పొందుకున్న శ్రమలు వ్రాసినప్పటికి తన తల్లి దగ్గర నుండి ఒక్క జవాబు కూడా రాలేదు. ఈయన తన తల్లికి 100 లేఖలకు పైగా వ్రాసారు. ఈ 100 లేఖలకు జవాబుగా తన తల్లి ఒక పోస్ట్ కార్డులో ఒక సంఘటనను వ్రాసారు. ఇద్దరు వ్యక్తులు చెరసాలలో బందించ బడ్డారు ఒకతను తన యొక్క బాధకరమైన పరిస్థితిని చూసి కన్నీరు కారుస్తూ తల వంచుకొంటు మట్టిని చూస్తూనే బాధపడుతు తన రోజులను గడిపాడు. ఇంకొక ఆయన తుప్పు పట్టిన కిటికీ నుండి ఆకాశ నక్షత్రాలు చూస్తూ వాటి అందమును, వాటి ప్రకాశమును చూసి సంతోషముతో కలమును గడిపాడు. వీరిలో నువ్వు ఎవరి వలె ఉండాలి అని అనుకొంటున్నావు అని వ్రాసి పంపించారు. ఈ లేఖను చదివిన తన కుమారుడు సంతోషంతో, ఉత్సాహముతో తన సైన్య శిక్షణను ముగించుకొని అమెరికా దేశపు 34వ అధ్యక్షుడుగా మారాడు.
అపోస్తులుడైన పౌలు పడిన కష్టాలు ఇంత అంత కాదు. ఎన్నో సమస్యలు, కష్టాల మధ్యలో అతను నడిచినను క్రీస్తు కొరకు తన కష్టములను ఓపికగా సహించారు. ఆ కష్టముల గురించి పౌలు కృంగిపోకుండా క్రీస్తు తనను పిలిచిన పిలుపునకు నిజాయితీగా ఉండటం వలన వాటన్నింటిని ఎన్నతగినవు కావు అని ఆశ్చర్యకరముగా చెప్పారు. ఆ శ్రమలు మిక్కిలి ఘనమైన, అధికమైన, మహిమను కలుగుజేస్తాయి అని విశ్వసించారు.
ప్రియమైన వారలారా! మనము కూడా అనేకమైన శ్రమలు మధ్యలో వెళుతూ ఉండవచ్చు. అయితే ఆ శ్రమలను మనం చూస్తే అవి పెద్దగా కనిపించి కష్టముగానే అనిపిస్తాయి. అయితే శ్రమలు ఏవియు శాశ్వతం కావు. ఒక రోజు అవి మనలను విడిచి పోతాయి. కాని ఇలా జరిగింది అని బాధ పడితే మనకు సహాయం చేయలేరు.
- బ్రదర్. శంకర్ రాజ్ గారు.
ప్రార్ధన అంశం:-
ప్రతి రోజు వేకువ జామున 5గంటలకు జరుగుతున్న హీలింగ్ సర్వీస్ ద్వారా అనేకులు అద్భుతమైన స్వస్థతలు పొందుకొనేటట్లు ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250