Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.03.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 23-Mar-2022

దిన ధ్యానము(Telugu) 23.03.2022

అంశం:-  దేవుడు గొప్పవాడు.

"మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు" - 1యోహాను 4:4

ఒక చిన్నవాడు తన తాతయ్యతో కలిసి విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. చాలా దూరం ప్రయాణం కావడంతో తన సంచిలోనుండి ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాడు. వాడి పక్కన కూర్చున్న ఆయన ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్. ఆ చిన్నవాడు ఏ పుస్తకమును చదువుతున్నాడో అని చూసారు. అది పరిశుద్ద గ్రంధం కావడంతో ఈ ప్రొఫెసర్ కు చాలా సంతోషం. ఆ చిన్న వానితో కొంచం సమయం గడుపుదాం అనుకొని బాబు దేవుడు చెయ్యలేని ఏదైనా ఒక గొప్ప పని చెప్పు అని అడిగి నువ్వు చెప్పే జవాబు సరైనది అయితే ఒక పెద్ద ఆపిల్ పండును ఇస్తాను అన్నారు. ఆ చిన్న వాడు పరిశుద్ద గ్రంధం మూసివేసి కొంచం ఆలోచించి అయ్యా నేను కూడా మీకు ఒక విషయం అడుగుతాను దేవుడు చెయ్యలేని గొప్ప కార్యము ఉంటే చెప్పండి నేను మా తాతయ్య తో చెప్పి ఒక పెట్టి నిండా ఆపిల్ పండ్లను కొని ఇస్తాను అన్నాడు. 

మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారం ఆయెను, ఆయన ఆజ్ఞపించగానే కార్యము స్థిరపరచ బడెను. ఇంత పెద్ద ప్రపంచమును సృష్టించిన దేవుడ్ని మన రక్షకునిగా కలిగి ఉన్నాము. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చిన వాడు, యొర్దాను నదిని వెనుదిరిగి ప్రవహించేలా చేసిన వాడు. గాలిని సముద్రమును గద్దించి నిమ్మల పరిచిన వాడు. కుష్టు రోగులను స్వస్థ పరిచిన వాడు, చెవిటి వారికి చెవులను, మూగ వారికి నోటిని, గ్రుడ్డివారికి కనులను ఇచ్చినవాడు, చనిపోయిన వారిని లేపినవాడు. ఆయన సెలవిస్తున్న మాట నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని యిర్మీయా గ్రంధం 32:27లో అడుగుతున్నారు. 

ప్రియమైన వారలారా! ఈరోజు మీకు ఒక అద్భుతం అవసరమై ఉన్నదా? ప్రతి రోజు మీ జీవితంలో పోరాటములు ఎక్కువ అవుతున్నాయా? సమస్యలను చూసి కృంగిపోయి ఉన్నారా? పిల్లల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? అప్పుల బాదలలో ఏం చెయ్యాలి అని అర్ధం కాని స్థితిలో ఉన్నారా? దేని కొరకు కలత చెందవద్దు. ఈ సమస్యలన్నింటిని మార్చగలిగే గొప్ప దేవుడు మీతో ఉన్నాడు. మీ సమస్యలను ఆయనతో పంచుకొనండి. సంపూర్ణంగా ఆయనను నమ్మండి అప్పుడు మీ దుఃఖమును సంతోషంగా ఆయన మార్చుతారు. ఆమెన్.
-    బ్రదర్. పి.శివ గారు.

ప్రార్ధన అంశం:-
ఆఫీసు పనికి కంప్యూటర్, ల్యాప్ టాప్ చాలా అవసరమైన యున్నవి వీటిని ఇచ్చువారు ముందుకు వచ్చేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/ çarkbet çarkbet giriş