Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.03.2022
Share:

By Village Missionary Movement

Saturday, 26-Mar-2022

దిన ధ్యానము(Telugu) 26.03.2022

అంశం:-  సత్క్రియలు

"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" - మత్తయి 5:16

ప్రపంచంలోనే మిక్కిలి అద్వానమైన చెరసాల అని చెప్పబడేది సిస్ సిస్ చెరసాల. చెరసాల కాపలాదారుని భార్య అయిన కేథరిన్ లాస్ అప్పుడప్పుడు తన పిల్లలతో కలిసి చెరసాలకు వెళతారు. అప్పుడు ప్రతి ఖైదీతో మాటలాడుతారు. హత్య నేరం వలన చెరసాలలో బంధింపబడ్డ ఒక ఖైదీ చూపులేని వాడిగా ఉండుట చూసి అతనికి  బ్రైల్లి లిపిని అతనికి నేర్పించారు. ఇంకా చెవులు వినిపించని, మాటలు రాని 6గురు ఖైదీలకు ఇతరులను అర్ధం చేసుకొనుట నేర్పించారు అలానే వారితో మాట్లాడే విధానము నేర్పించారు. ఈ విధముగా ఖైదీల ఆవసరతలు ఎరిగి సేవ చేస్తున్నారు. అనుకొనని విధముగా ఒక కారు ప్రమాదంలో కేథరిన్ మరణించారు అనే వార్తను విని 100 మంది ఖైదీలు ఆమెను చూచుటకు వచ్చి కన్నీరు కార్చారు. 

ఇదేవిధంగా పరిశుద్ద గ్రంధంలో యొప్పే అను పట్టణంలో ఉన్న డోర్క ఆనే ఒక శిష్యురాలు కూడా తన ఉండే స్థలములో ఉన్న అనేకమంది ప్రజలకు ఆమె సహాయం చేశారు. చాలా మంది విధవరాండ్రులకు సహాయం చేయడంతో పాటు చాలా మందికి అంగీలను, వస్త్రములను కుట్టి ఇచ్చారు. ఆమె చనిపోగా ఆమె శవమును కడిగి వారు ఏడ్చారు. ఆమె వారికి ఇచ్చిన అంగీలను, వస్త్రములను పేతురు ఎదుట పెట్టి అక్కడ నిలుచున్నారు. పేతురు వచ్చి ప్రార్ధించడంతో ఆమె కన్నులు తెరచి లేచి కూర్చుంది. ఈ డోర్క తనకు ఉన్న పనుల మధ్యలో కూడా అనేకులకు సహాయం చేసింది. అందువలన ఆమె యొక్క కీర్తి మరియు ఆమె పేరు యొప్పే పట్టణం అంత వ్యాపించింది. 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఈనాడు అనేకులకు తన ఇంటి పక్కన లేదా సమీపంలో ఉన్న వారిని గూర్చి  కొంచం కూడా తెలియదు. అలా చేయకుండా కేథరిన్ వలె, డోర్క వలె ఇతరుల ఆవసరతలు ఎరిగి వారికి సహాయం చెయ్యాలి. మనలను సత్క్రియలు చేసినప్పుడు క్రీస్తు ప్రేమను ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. ఎందుకు అనగా మనం జీవించి చూపిస్తున్నాం కాబట్టి. దానిని బట్టి చాలా మంది క్రీస్తు యొద్దకు నడిపించబడతారు. మనం కాలక్షేపం చేసే సమయాలు, డబ్బు, అన్ని మనకు ఆత్మల వలె మనకు దొరుకుతాయి. ఆత్మలు అంటే పరలోక ధనం కదా. సత్క్రియలు చేద్దాం పరలోక ధనం సంపాదించుకుందాం.
-    శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

ప్రార్ధన అంశం:-
గెత్సేమనే క్యాంపస్ లో జరిగే వైద్య సేవలు కొరకు, ఆ సేవలు ద్వారా స్వస్థత పొందుకున్న ప్రతి ఒక్కరి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet