By Village Missionary Movement
Sunday, 03-Apr-2022దిన ధ్యానము(Telugu) 03.04.2022 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
అంశం: చింతించకుడి.
"...మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" - మత్తయి 6:33
హాలో పిల్లలు ఎలా ఉన్నారు? పెంపుడు జంతువులను పెంచడం అంటే మీకు చాలా ఇష్టమే కదా?. ఏఏ జంతువులను పెంచుతారో చెప్పండి చూద్దాం. కుక్క, పిల్లి, చిలుక, మేక ఇలా చెప్తూనే ఉంటారు కదా. మీ వలె రోలి అనే అక్క కూడా ఒక పిల్లిని తన ఇంట్లో పెంచుతూ వచ్చారు. ఆ పిల్లికి ప్రతి రోజు పాలు మరియు మాంసం వంటి నచ్చిన పదార్దాలు పెట్టి ముద్దుగా చేసుకొనే వారు. హఠాత్తుగా ఒక రోజు ఆ పిల్లి కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికి చూసినా ఆ పిల్లి కనిపించనే లేదు. ఆ అక్క చాలా బాధ పడింది. కొన్ని రోజుల తరువాత ఊహించని సమయంలో ఆ పిల్లి రోలి అక్క ఇంటికి వచ్చింది. దానిని చూసిన ఆ అక్క చాలా సంతోష పడ్డారు. ఆ పిల్లికి ఇష్టమైన చేపను వేస్తే తినకుండా నోటితో పట్టుకొని వెళ్ళిపోయింది. ఆ పిల్లి వెనక వెళ్లిన అక్కకు ఒక అద్భుతం కనబడింది. ఆ అద్భుతం ఎంటో తెలుసా? ఆ పిల్లి తన యొక్క మూడు పిల్లలకు ఆ చేపను తన నోటితో ముక్కలు చేసి పంచి పెట్టింది. యేసయ్య ఆ పిల్లికి ఎంత జ్ఞానం ఇచ్చారు అని రోలి అక్క ఆశ్చర్య పడ్డారు. ఆ పిల్లి తన పిల్లలకు ఎక్కడ ఆహారం దొరుకుతుంది నేను ఎలా తింటాను అనే చింత లేనే లేదు. చూసారా పిల్లలు మీరు కూడా ఈ లోకంలో జన్మించుటకు ముందే మీ గురించి యేసయ్య ఆశ్చర్య కరమైన ప్రణాలికను కలిగి యున్నారు. మీ పనులన్నింటిని ఆయన ఎరిగి యున్నారు. ఆహారం లేదు మంచి డ్రెస్ లేదు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చింతించకండి. నేను అనుకున్నది జరగలేదు, నేను ఆశించింది నాకు దొరకలేదు అని ఫీల్ అవ్వవలసిన అవసరం లేదు. చేయాల్సినది అంతా మొదట దేవున్ని వెతకాలి ప్రతి రోజు ఆయనతో మాట్లాడాలి. అప్పుడు మీ ప్రతి ఆవసరతలు ఆయన చూసుకొంటారు. యేసయ్యను మీరు వెతికినట్లయితే ఆవసరతలు అన్ని మిమ్ములను వెతుక్కుంటూ వస్తాయి. ఓకేనా.
- శ్రీమతి. గ్రేస్ సురేష్ కుమార్ గారు
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250