Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.04.2022
Share:

By Village Missionary Movement

Sunday, 03-Apr-2022

దిన ధ్యానము(Telugu) 04.04.2022

అంశం:- ఒక గ్లాస్ పాలు

"ఈమె తన శక్తికొలదిచేసెను" - మార్కు 14:8

మార్కు సువార్త 14 వ అధ్యాయం 1-9 వచనాలలో ఒక స్త్రీ యేసుక్రీస్తు తల మీద మిక్కిలి విలువ గల అత్తరును పోసిన సంఘటనను చదువుతున్నాము. ఆమె అలా చేయడంతో చుట్టూ ఉన్న వారంతా ఆమెను గూర్చి సణుగుకొన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఈమె నా యెడల మంచి కార్యము చేసెను అని చెప్పి ఆమెను పొగిడారు. అది మిక్కిలి విలువ గల అత్తరు. ఆమె యేసుక్రీస్తుని విలువైన దేవుడు అని ఎరిగి ఆయన పై ఉంచిన ప్రేమతో ఆ కార్యం చేసింది. ఈ నాటి కాలంలో మన యొక్క జీవితమును మనం కొంచం గమనించి చూద్దాం. ప్రభువు మన గురించి మంచి కార్యము చేస్తున్నాము అని చెప్పే విధంగా మనం ఉన్నామా? మన శక్తి కొలది ప్రభువైన దేవుని కొరకు ఏదైనా చేస్తున్నామా? మనలను మనమే పరీక్షించుకొందాం. ఒక వేళ నేను ఏం చెయ్యగలను అని మీరు అనుకొనవచ్చు. కాని కొన్ని మంచి కార్యములు మనము చెయ్యగలిగినవే. ఉదాహరణకు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వవచ్చు. దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వవచ్చు. చదువుకొంటున్న పేద పిల్లలకు నోట్ బుక్స్ కొని ఇవ్వవచ్చు. ట్యూషన్ చెప్పవచ్చు, వ్యాధులలో ఉన్న వారి యొద్దకు వెళ్లి వారికి ఓదార్పు ఇవ్వవచ్చు. ఇలా చాలా ఉన్నవి. 

ఒక సారి ఒక తల్లి రోడ్డు పైన మిక్కిలి అలసిపోయి ఉన్న ఒక చిన్న వానికి ఒక గ్లాస్ పాలు ఇచ్చారంట. చాలా  సంవత్సరాలు గడచిన తరువాత ఆ తల్లి వ్యాధికి గురై హాస్పిటల్ లో చేర్చబడ్డారు. అది ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్. చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆ తల్లి అనుకొన్నారు. చికిత్స పూర్తియైన చివరి రోజు బిల్ వచ్చింది. అందులో మొత్తం బిల్ అని ఉండవలసిన ప్లేస్ లో ఒక గ్లాస్ పాలు అని ఉంది. ఆ తరువాత ఆ తల్లికి తెలియ జేయబడింది ఆ హాస్పిటల్ డాక్టర్ ఆ తల్లి ఒక రోజు గ్లాస్ పాలు ఇచ్చిన ఆ చిన్న వాడే ఆ డాక్టర్ అని. 

అవును ప్రియమైన వారలారా! మనం కొలిచే కొలత ప్రకారమే దేవుడు కచ్చితంగా మనకు కొలిచి ఇస్తారు. అందువలన మంచి కార్యములు చేద్దాం. మన శక్తి కొలది చేద్దాం. 
-    శ్రీమతి. భువనా ధనబలన్

ప్రార్ధనా అంశం:-
10th మరియు ఇంటర్ చదివే మిషనరీ పిల్లలు మరియు హోమ్ పిల్లలు మంచి మార్కులు సంపాదించేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet holiganbet tambet grandpashabet betgit radissonbet