By Village Missionary Movement
Tuesday, 12-Apr-2022దిన ధ్యానము(Telugu) 12.04.2022
అంశం:- దప్పిగొనుచున్నాను.
"లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొనుచున్నాననెను" - యోహాను 19:28
యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 5వ మాట. భారతదేశం స్వాతంత్రం పొందుకున్న రోజులు అవి. రాజస్తాన్ రాష్ట్రంనకు ఆనుకొని ఉన్న పాకిస్థాన్ భాగమును విభజించే పనిలో భూమి కొలతల పనిలో అధికారులు పాల్గొన్నారు. ఈ పనిలో ఇంగ్లండ్ కు చెందిన వేల్ట మెన్ అనే అతను ప్రధాన అధికారిగా పనిచేయడానికి వచ్చారు. ఇతను భక్తి గల క్రైస్తవుడు. పగటి వేల ఎడారి ఎండలో భూమి కొలతలలో పాల్గొని సాయంత్రం సమయంలో తనతో పాటు పనిచేసే వారికి సువార్త ప్రకటించే వారు. ఒక రోజు రాత్రి నిండు చంద్రుని కాంతిలో 40 మంది ఉన్న సమావేశంలో యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతున్నారు. రక్షణ, పరిశుద్ధత, న్యాయతీర్పు, పరలోకం అని మాటలు కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు వారందరు అక్షర సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగారు. అవును ఉన్నది మీ భాషలో నా యొద్ద రెండు గ్రంథములు ఉన్నవి. నేను వాటిని మీ కొరకు తీసుకొనివస్తాను అని గుడారము దగ్గరకు వెళ్లారు. తిరిగి వచ్చినప్పుడు ఆ గ్రంథమును తీసుకొనుటకు 40 మంది చేయి చాపారు. దానిని చూసి వేల్ట మెన్ కు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ పుస్తకమును నాకు ఇవ్వండి అని అడిగిన 40 మంది యొక్క ఆశను చూసి ఆశ్చర్యపడ్డారు. పరిశుద్ద గ్రంధం పొందుకొనుటకు భారతీయులు ఇంత దాహంతో కలిగి ఉన్నారు అని మరియు ఆత్మలో అగ్ని గలవారిగా దేవుని సేవను చెయ్యడం ప్రారంభించారు. భారతీయులు యేసుని ఎరుగుటయే నా యొక్క దాహమై ఉన్నది అని వేల్ట మెన్ చెప్పారు.
ఈనాటి ధ్యానంలో ప్రభువైన యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పుట మనం చదువుతున్నాం. లోక పాపమును మోసుకొని పోయిన ఆయన, ఏ ఒక్కరు నశించి పోకుండా అందరూ మారుమనస్సు రక్షణ పొందాలి అని దాహం కలిగి ఉన్నారు. ఒక పాపి తన చెడు మార్గములు విడిచి తిరిగి యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. ఒక మనుష్యుడు మారుమనస్సు పొందితేనే పరలోకం సంతోషం చెందుతుంది అనుకొంటే ఒక జన సమూహమే రక్షణ పొందుకొన్నప్పుడు పరలోకం అంతా సంతోషంతో ఉప్పొంగుతుంది కదా! ఇదే మన కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు యొక్క దాహమును తీర్చే కార్యమైయున్నది. అనగా దేవుని యొక్క కోరిక నెరవేర్చే భాగమై యున్నది. ఆత్మల రక్షణే దేవుని యొక్క దాహమును తీరుస్తుంది. యేసు యొక్క దాహం తీర్చుటకు ఆత్మలను సంపాదించుటకు ముందుకు రండి. ప్రభువు మిమ్ములను బలపరుస్తారు. ఆమెన్.!
- బ్రదర్. జాకబ్ శంకర్ గారు
ప్రార్ధన అంశం:-
60 మంది మిషనరీ ఇల్లులను కట్టే భాగస్వాములను దేవుడు ఇచ్చేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250