By Village Missionary Movement
Saturday, 23-Apr-2022దిన ధ్యానము(Telugu) 23.04.2022
అంశం:- నా సమయం ఎక్కడ ఉంది?
"ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా" - మత్తయి 26:40
ఒక సారి భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకొంటున్నారు. అప్పడు భర్త తన భార్యతో నువ్వు ఎప్పుడు బిజీగా వుంటున్నావు నాతో అస్సలు మాట్లాడటం లేదు, కాలక్షేపం చెయ్యడం లేదు. ఆఫీస్ లో వుంటున్నావు లేక ఇంటికి వచ్చి ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో ఆఫీస్ పనులను చేస్తున్నావు. నాకు ఏమి అవసరం నేను వేటిని కోరుకొంటున్నాను. నేను ఎలా వున్నాను అని దేనిని గూర్చి కూడా కొంచెం ఆలోచన లేకుండ నీ ఆవసరతలు మాత్రమే ఒకటి లేదా రెండు మాటల్లో చెప్పి వెళ్లిపోతున్నావు అన్నాడు. ఆ స్త్రీ మాత్రం కొంచం కూడా పట్టించు కోకుండా మరల తన పనులను చేయడం మొదలు పెట్టింది. అవును ఒక భార్యాభర్తలు సంబంధం వారు ఒకరికొకరు ఇచ్చే సమయంలోనే బలపడుతుంది. పరిశుద్ద గ్రంధం ప్రకారంగా మనం పెండ్లి కుమార్తె గా ఉన్నాము. కాని ఒక రోజులో పెండ్లి కుమార్తెగా ఎంత సేపు యేసుక్రీస్తు తో గడుపుతున్నాం. పదిలో ఒకటి దేవునికి అని కొందరు చెప్తుంటారు. నిజముగా మనము ఆలోచించి చూచినట్లయితే మనము ఒక గంట సమయం కూడా దేవునితో గడప లేకపోతున్నాం. లెంట్ కాలంలో ఉన్న ఈరోజుల్లో మనం దేవునికి ఇచ్చే సమయం గురించి కొంత అలోచిద్దాం. తరువాత చూసినట్లు అయితే మన కుటుంబం. మనం ఉండే ఈ బిజీ లోకంలో కుటుంబ ఐక్యత అనేది కేవలం సామాజిక నిర్మాణం వలె ఉన్నది. దానిలో ప్రేమ, సంతోషం, సమాధానం తొలగించే గొడవలు చేదు అనే ప్రతికూల పనులే నిండి ఉన్నాయి. ప్రారంభ రోజుల్లో అందరూ ఒక దగ్గర కూర్చొని భోజనం చేయడం, ఆరోజు జరిగిన సంగతులను ఒకరితో ఒకరు పంచుకొంటూ సంతోషించే కార్యములు ప్రతి కుటుంబంలో ఉండేవి. కుటుంబంలో ఉన్న వారు అందరూ ఒక చోట చేరి కాలక్షేపం చేసే సమయం ఎక్కువగా ఉండేది. ఇవి భార్యాభర్తల మధ్య మంచి ఐక్యతను కలుగ జేస్తాయి. ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరిగే మంచి చెడులను ఇంట్లో ఉండి తెలుసుకొంటున్నాం. కాని ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియడం లేదు.
ప్రియమైన వారలారా! దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే నా సమయం ఎక్కడ వుంది? ఈరోజు మీ సమయం గూర్చి ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి మనం ఇచ్చినప్పుడు మనం నిశ్చయముగా మన జీవితం సంతోషంతో నిండి ఉంటుంది.
- బ్రదర్. ఆర్. రాక్ సన్ గారు.
ప్రార్ధన అంశం:
సేవకుల కొరకు ప్రత్యేకంగా వ్రాసి అందజేస్తున్న పత్రికల ద్వారా సేవకులు బలముగా అభివృద్ధి పొందేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250