Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.04.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 24-Apr-2022

దిన ధ్యానము(Telugu) 24.04.2022 (Kids Special)

 

అంశం:- మార్పులేనివాడు.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు" – మలాకీ 3:6

 

అడవిలో ఉన్న చాలా రకాల పక్షులు అన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి అట. ఆ సమావేశమునకు మన దేశపక్షి కూడా హాజరయ్యింది అంట. పిల్లలు మీకు మన దేశ పక్షి ఏంటో తెలుసా? నెమలి మర్చి పోకుండా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా. ఏంటి మన మధ్యలో చాలా రకాల పక్షులు లేవు అని నెమలి బాధపడింది అంట. దీనిని విన్న డేగ మా జాతి పక్షులు కూడా చాలా తగ్గిపోయాయి అని చెప్పింది. మేము రాజుల వలె గ్రామం చుట్టూ తిరిగి వస్తాము కాని అది ఇప్పుడు లేదు అని అన్నది. వెంటనే నెమలి కాకులను చూసి ఏంటి తమ్ముడు మీరు ఎక్కువగా ఊర్లోకి వెళ్లి ఇల్లులు చుట్టూ తిరిగి చూస్తారు కదా అక్కడ పక్షుల జాడ తగ్గిపోయింది అందరూ చెబుతున్నారు కదా మరి దానికి కారణం ఏంటో తెలుసా? వెంటనే కాకులు ఏమని చెప్పమంటారు లోకంలో రకరకాల మందులు కనుగొని పంట చెలకు వెయ్యడం ద్వారా పురుగులు చనిపోతున్నాయి. రకరకాల నూనెలు, ప్లాస్టిక్ వస్తువులు కాల్చడం వలన గాలి కాలుష్యం అవుతుంది. అది మాత్రమే కాదు మనుష్యులు ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ వలన మన జాతి తగ్గిపోతుంది అని కాకులు చెప్పాయి. వెంటనే మిగతా పక్షులు అన్నీ కూడా నిజమే అని చెప్పాయి. ఈ విషయాన్ని విన్న నెమలి నేను అప్పటి కాలంలో పూరి విప్పి నాట్యం ఆడితే చిన్న పిల్లలు పెద్దవారు అందరూ నిలబడి చూసేవారు ఇప్పుడైతే వారు వేసుకున్న బట్టలు రకరకాలుగా మెరుస్తున్నాయి. అందుకే నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని తన బాధకరమైన జీవితాన్ని చెప్పి ముగించింది ఆ నెమలి. 

 

అప్పుడు ఒక పిచ్చుక లేచి ఈ ప్రపంచం కృత్రిమ ప్రపంచంగా మారిపోయింది అని చెప్పింది. ఇతర పక్షులు అన్నీ నువ్వు చాలా చిన్న పక్షులు ఉన్నప్పటికీ నీకు ప్రపంచంలో నలుదిక్కులు జరుగుతున్న విషయాలు తెలుసుకున్నావు. ఈ లోకం మరియు ఈ లోకంలో ఉన్న మనుష్యులు మారిపోయారు కాని మనలను సృజించిన దేవుడు ఏ ఒక్కరోజు కూడా మారిపోరు అని నెమలి చెప్పింది. వెంటనే అన్నీ పక్షులు ఎస్ అని చెప్పి మనకు ప్రతి రోజు ఆహారం పెట్టిన ప్రభునకు కృతజ్ఞతలు తెలుపుదాం అని చెప్పి ఆ సమావేశం ముగించాయి. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి! పక్షులు మాట్లాడుకున్న మాటలు విన్నారా? సమస్తము మారిపోతుంది. యేసుక్రీస్తు మాత్రమే మారని వారు అని పక్షులు కూడ తెలుసుకున్నాయి చూసారా కాబట్టి మారని దేవున్ని మరచిపోకూడదు. మారిపోయే మనుష్యులను వెతుక్కుంటూ వెళ్లకూడదు. యేసయ్య ను వెతికి నిజమైన సంతోషమును పొందుకొనుటకు రెడీ కదా! సూపర్.

- శ్రీమతి. జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet