By Village Missionary Movement
Tuesday, 26-Apr-2022దిన ధ్యానము(Telugu) 26.04.2022
అంశం:- ముందుకు సాగుదాం.
"మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి" - యెషయా 43:18
ఒక రోజు ఒక వ్యక్తి చాలా ఎత్తుగల గోపురం పైన ఎక్కాడు. అతనికి ఎత్తు అంటే చాలా భయం కాబట్టి ఆ భయమును పోగొట్టుకొనుటకే ఆ గోపురం ఎక్కుతున్నాడు. పైకి ఎక్కుతున్న అతను పైకి చూస్తూ ఎక్కాలి కాని అతను క్రిందకి చూసి ఎంత పైకి ఎక్కేసానా అని భయపడి కళ్ళు తిరిగి క్రిందపడి చనిపోయాడు. మనము కూడా చాలా సార్లు మన జీవితంలో గడచిన కాలంలో జరిగిన వాటిని గుర్తు చేసుకొంటూ ముందుకు సాగకుండా నిలబడిపోతున్నాం. కాని పరిశుద్ద గ్రంధం స్పష్టంగా చెబుతుంది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వ కాలపు సంఘటనలను తలంచుకొనకుడి అని. పాతవి గతించిపోయేలా పరిశుద్ద గ్రంధం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాటినే గుర్తు చేసుకున్నట్లు అయితే దేవుడు మనకు ఇచ్చిన నూతన జీవితమును నూతన ఆశీర్వాదములను మనము నిశ్చయముగా సొంతం చేసుకొనలేము. ఇందుకు పరిశుద్ద గ్రంధంలో సరైన ఉదాహరణ లోతు యొక్క భార్య. ప్రభువు వారిమీద కృప చూపి కాపాడాలి అని బయటకు తీసుకొని వస్తున్నప్పుడు ఆమె దేవుని మాటకు లోబడకుండా వెనుదిరిగి చూసింది. అందువలనే ఆ స్థలములోనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడు తన కొరకు ఉంచిన నూతన జీవితం కోల్పోయింది. ఈరోజు మనం మనలను పరీక్షించు కుందాం. ఒక వేళ మనం కూడా లోతు భార్య వలె విడిచిపెట్టిన కార్యములను వెనుదిరిగి చూస్తువున్నట్లు అయితే మనము దేవుని చేతికి అప్పగించుకొందాం. వెనుకున్న వాటిని మరచి ముందుకు సాగుదాం. పాతవి తొలగిపోనివ్వండి వాటిని మరచిపోదాం. వాటిని గుర్తు చేసుకొనవద్దు వాటి గురించి ఆలోచించ వద్దు. నూతన కార్యములకు నేరుగా నడిపించే దేవుని వైపే చూస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్.
- బ్రదర్. ఆర్. ప్రిన్సెస్ గారు
ప్రార్ధన అంశం:-
ఆకలి గొనిన వారికి ఆహారం ఇచ్చే ఆలోచన మూలముగా కలుసుకునే వ్యక్తులు అందరూ దేవున్ని ఎరిగి నమ్ముకొనే లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250