By Village Missionary Movement
Thursday, 28-Apr-2022దిన ధ్యానము(Telugu) 28.04.2022
అంశం:- ఇయ్యుడి
"మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను” - లూకా 6:38
నేను 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక రోజు చిన్న పిల్లల పరిచర్య కొరకు పాఠశాలలో ఉన్న చిన్న పిల్లలకు నా సాక్ష్యం చెప్పడానికి పిలవబడ్డాను. కిడ్నీ పనిచేయక పోవడం అలానే దానికి జరిగే సర్జరీ అనేది ఈ చిన్న పిల్లలకు ఎలా చెప్పేది అని యేసయ్య సన్నిధిలో నేను ప్రార్ధన చేసి దేవుని కృపతో చెప్పేసాను. బయాప్సి, డయాలసిస్ అనే వాటి కొరకు పైపైన చెప్పి ముగించాను. కధ, పాటలు, స్కిట్ అన్నీ పూర్తి అయిన తరువాత 8వ తరగతి చదువుతున్న చిన్న పాప నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య మీ సాక్ష్యం నాకు చాలా ప్రయోజన కరముగా ఉండేది. దేవుడు నా దగ్గర ఉన్న డబ్బులను మీకు ఇమ్మని చెప్పారు అని చెప్పి రెండు రూపాయలు నాకు ఇచ్చింది. ఆ పాప మరల ఈ డబ్బులు మా అమ్మ నాకు చెక్లెట్స్ కొనుక్కోమని ఇచ్చారు అని చెప్పింది. వెంటనే నాతో పాటు ఇంకొక అన్నయ్య వచ్చారు కదా ఆ అన్నయ్యకు ఇవ్వు అని చెప్పాను. తన వెనకాడి మొహమాటంతో ఆ రెండు రూపాయలు ఆ అన్నయ్యకు ఇచ్చింది. ఆ డబ్బులను సంతోషంగా తీసుకొని ప్రార్ధనా చేశారు. వెంటనే ఆ చిన్న పాపలో కలిగిన సంతోషానికి హద్దులే లేవు. ఈ సంఘటన చూసిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంత చిన్న వయస్సులో యేసుని స్వరం విని వెంటనే లోబడిన తన స్వభావమును చూసి ఆశ్చర్య పోయాను. ఇదే స్థలంలో నేను ఉంటే ఏమి చేసేవాడినో అని ఆలోచించాను. పరిశుద్ద గ్రంధంలో యేసుక్రీస్తు ద్వారా అద్బుతములను పొందుకున్న అనేకులు వెంటనే ఆయనను వెంబడించారు అనగా వెంటనే తన తమ జీవితములను దేవునికి సమర్పించుకొన్నారు అని చదువుతున్నాం. కాని ఈరోజు మనలో అనేకులు దేవుని మాటలను పూర్ణ మనస్సుతో వినకుండా విన్న వారిలో అనేకులు వాటికి లోబడుటకు సిద్ధంగా లేకుండా ఉన్నారు.
ప్రియమైన వారలారా! దేవుని మాటలు విని నడుచుకొనే హృదయం మనకు కావాలి. కానుకలు మాత్రమే ఇవ్వడం కాదు మన యొక్క జీవితం, యవ్వనం, సమయం, ప్రతిభ అని ఏమి ఇచ్చిన నిశ్చయముగా దేవుడు వాటికి బదులుగా రెట్టింపు మనకు తిరిగి ఇస్తారు. అవి ఇహ లోకంలో మాత్రమే కాదు పరలోకంలో కూడా మన కొరకు ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి.
- బ్రదర్. పి. ప్రవీణ్ గారు.
ప్రార్ధన అంశం:-
తమిళనాడులో చర్చిలు లేని గ్రామాలలో 1000 చర్చిలు కట్టుటకు చేసే ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250