Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.05.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 04-May-2022

దిన ధ్యానము(Telugu) 04.05.2022

 

అంశం:- క్షమాపణ.

 

"ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి" - కొలస్సీయులకు 3:13

 

చాలా ఎక్కువ మంది ప్రజలు ఉన్న ఒక వీధిలో ఒక మామ్మ పండ్ల బుట్టను తీసుకొని వెళ్తున్నారు. తనకు ఎదురుగా వస్తున్న దినేష్ అనే ఒకాయన ఆ బుట్టను త్రోసి వేసాడు. వెంటనే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని గమనించిన అందరూ దగ్గరకు వచ్చి చూస్తున్నారు. కాని ఆ మామ్మ శాంతముగా దినేష్ ను చూసి తమ్ముడు నువ్వు చూడకుండా త్రోసివేశావు ఇకపై ఎప్పుడు ఇలా చేయవద్దు అని చెప్పి నిశ్శబ్దంగా వంగి పండ్లు అన్ని బుట్టలో వేసుకొంటున్నారు. ఆమె చెప్పినది విన్న దినేష్ తన తప్పును ఎరిగి బాధపడి ఆ మామ్మ యొద్ద క్షమాపణ అడిగాడు. పండ్లు అన్ని ఏరి బుట్టలో వేసి సహాయం చేసాడు. చుట్టూ నిలుచుని చూస్తున్న వారందరూ మామ్మ యొక్క స్వభావమును చూసి ఆమెను పొగిడారు. మనము కూడా మన ఇళ్లల్లో మన ఉద్యోగ స్థలాల్లో ఇటువంటి కోపం తెప్పించే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము. అప్పుడు మనం కోప పడకుండా ఆ స్థలములో యేసుక్రీస్తు ఉన్నట్లు అయితే ఏం చేస్తారో అదే విధంగా మనము కూడా చేసినట్లు అయితే పరిస్థితులు తలక్రిందులుగా మారుతాయి. మనం ఒకరికొరకు క్షమించు కొంటు శాంతముతో కూడిన మనస్సుతో సమాధానం ఇచ్చినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 

 

యోబు సమస్తమును కోల్పోయి శరీరమంతా కురుపులతో బాధింప బడ్డాడు. అప్పుడు తనను ఓదార్చుటకు వచ్చిన స్నేహితులు తను ఒక పాపి అని చేసిన పాపములకు శిక్ష అనుభవిస్తున్నాడు అని నేరం మోపారు. అంతేకాక యోబును చాలా బాధపెట్టారు కాని యోబు మాత్రం యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకోనెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని తనకు కలిగిన పరిస్థితిని అంగీకరించి ఓర్చుకున్న యోబును తన జన్మ దినమున శపించే అంతగా దుక్కపరిచారు. కాని యోబు వారిని క్షమించి వారి కొరకు ప్రార్ధించాడు. శరీరంలో, మనస్సులో గాయములు ఉన్నప్పటికీ యోబు వారిని క్షమించి రెండతల ఆశీర్వదం పొందుకొన్నాడు. 

 

దీనిని చదువుతున్న స్నేహితుడు మామ్మ యొక్క క్షమించే గుణం దినేష్ తన తప్పును ఎరిగే విధంగా చేసింది. యోబు యొక్క క్షమించే గుణం ఆయనకు రెండతలు ఆశీర్వాదాలు తీసుకువచ్చాయి. మనకు అన్యాయం చేసేవారిని మనకు విరోధముగా మాట్లాడే వారిని మనం క్షమించుట కష్టమే కాని మనం క్షమించి నప్పుడు వారి మనస్సు మారే అవకాశం ఉంది. మనము కూడా మనశాంతితో జీవించవచ్చు. ఎవరినైన క్షమించ లేక విరోధముగా ఉన్నారా? క్షమించే గుణమును పొందుటకు దేవుని సహాయం అడుగుదాం. పరిస్థితులను చక్కగా మారుద్దాం.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాస్తున్న మిషనరీ పిల్లలు మరియు హోమ్ పిల్లలు మంచి మార్కులు పొందుకొనేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet radissonbet nesinecasino betbey cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/