Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.05.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 04-May-2022

దిన ధ్యానము(Telugu) 05.05.2022

 

అంశం:- అవసరమైనది ఒక్కటే.

 

"తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను" - లూకా 14:11

 

భారతదేశమునకు మిషనరీగా వచ్చి అనేక భారతీయ భాషలలో అనువాదించిన విలియం కేరీ కలకత్తాలో జీవించారు. అక్కడ బాగా చదువుకున్న వారు, ఉన్నత పదవిలో ఉన్న వారి మధ్యలో మంచి పలుకుబడి ఉండేది. ఒకసారి భారత దేశ గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు విలియం కేరీ కూడా పిలువబడ్డారు. విందులు ఉన్న ఒకతను ఇంకొక ఆయనతో విలియం కేరీని చూపించి ఇతను చెప్పులు తయారుచేసే వికీయం కేరీ కదా అని చెప్పాడు. ఈ మాటలు కేరీ కి వినిపించాయి. విలియం కేరీ అతనిని తిరిగి చూసి కాదయ్య నేను చెప్పులు తయారు చేసే వాడిని కాదు చెప్పులు కుట్టే వాడిని అన్నారంట. ఎంతగా తగ్గించుకొన్నారో చూడండి. కాళీగా ఉన్న బిందె నిండుతుంది కాని కాళీగా ఉండే కాళీ లేని బిందె నిండదు ఆని ఇందుకోసమేనా. సమస్తమును దేవుని యొద్దనుండి మనం పొందుకొంటున్నాం. దీనిని ఎరిగిన వాడు నిశ్చయముగా తన్ను తాను తగ్గించుకొనును. విధేయతకు మార్గ దర్శకుడు ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తే. విధేయతతో ఉండుట నేర్పించి జీవించి చూపించారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవుని సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పొలికగా పుట్టి దాశుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందు నంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2:6-8 వచనాల్లో వ్రాయబడి యుండుట మనం చూస్తున్నాం. పరిశుద్ద గ్రంధం చెబుతుంది సామెతలు 15: 33లో యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును అని యాకోబు 4:6లో ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని మనం చూడగలం. 

 

మనకు బాగా తెలిసిన పరిసయ్యుడు, సుంకరి ఉపమానములో తన్ను తాను తగ్గించుకొని ప్రార్ధించిన సుంకరి యే నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని లూకా సువార్త 18వ అధ్యాయం 10-14 వచనాల్లో చూడగలం.

 

ప్రియమైన వారలారా! మనం పాపి అని ఒప్పుకొనుటకు కృపను పొందుకొనుటకు విధేయత అవసరమై యున్నది. మన యొక్క సత్క్రియలు దేవుని యొద్ద హెచ్చించ దగినవి కాదు. మన యొక్క నీతిక్రియలు మురికి గుడ్డవలే యున్నవి. గర్వమును, ఆధిక్యతను మెచ్చుకొనుటకు మనం ఎవరము? అనేక సమయాల్లో మనం తగ్గించుకొనకుండుటకు మన యొక్క కొన్ని ఆత్మీయ అలవాట్లు చదువు, డబ్బు, బుద్ధి, డిగ్రీ , పదవి, వస్తువులు, అందం వంటివి మనకు కారణమై యున్నవి. ఆత్మీయమైన క్రియలు మంచివే ప్రార్ధించుట, మందిరమునకు వెళ్లుట, కానుకలు ఇచ్చుట, ఆత్మీయ తలాంతులు కలిగి యుండుట చాలా మంచివే. కాని వాటిని ఇతర విశ్వాసులతో లేదు స్నేహితులతో పోల్చి చూసి ఆత్మీయ గర్వమును కలుగజేసుకొనుట ప్రమాదకరం. కావున మనం ఎంతటి తలాంతులు కలిగి ఉన్నాసరే విలియం కేరీ వలె వినయమును దరించు కొందాం. మరణము వరకు తనను తగ్గించు కొనిన యేసుక్రీస్తు చేతిలో మనలను సమర్పించు కొందాం. ఆయనే మనలను చక్కగా నడిపించును గాక! ఆమెన్.

- బ్రదర్. పి.శివ గారు

 

ప్రార్ధన అంశం:-

ఈ. నెల అంతా జరిగే వి.బి.యస్ పరిచర్యలలో తీర్మానించు కొన్న విధముగా 3000 గ్రామాల్లో వి.బి.ఎస్ జరిపి పూర్తి చేయుటకు దేవుడు తన కృప అనుగ్రహించి ద్వారమును తెరువు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino