Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.05.2022
Share:

By Village Missionary Movement

Friday, 06-May-2022

దిన ధ్యానము(Telugu) 06.05.2022

 

అంశం:- జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం.

 

"ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే" - 1యోహాను 3:22

 

 స్విర్జర్ ల్యాండ్ లో ఉన్న హోటల్స్ అన్నీ సెలవుల్లో సంతోషంగా గడుపుటకు వచ్చిన వారితో నిండిపోయాయి. పగలు ఎక్కువ సమయం స్నో బోర్డింగ్ రాత్రి ఎక్కువ సేపు డాన్స్ చేస్తూ 10 నుండి 15 రోజులు గడిచిన తరువాత విశ్రాంతి కోసం తిరిగి ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. ఒక ఆదివారం సాయంత్రం కొంత మంది స్నేహితులు కలిసి ఒక ఆరాధనను ఏర్పాటు చేశారు. దానికి హోటల్ యజమాని కూడా అనుమతించారు. ఆరోజు సంగీత కూటములను మరియు డాన్స్ కూటములను మూసివేయమని వేడుకున్నారు. లెన్సీ క్లిక్ అనే ఒక దేవుని సేవకుడు ముఖ్య అతిథిగా పిలువబడ్డారు. కూటం ప్రారంభించిన కొద్దిసేపటికీ ఒక వ్యక్తి క్లిక్ యొద్దకు వచ్చి అతను మాట్లాడుటకు ఒక అంశంను ఇచ్చారు. ఆ అంశం ఏమనగా లైఫ్ విత్ ద క్యాప్టిల్ ఎల్. అయితే ప్రార్ధనతో క్లిక్ తన మాటలను ప్రారంభించారు. ఎల్ అనే ఇంగ్లీష్ క్యాప్టిల్ లెటర్ లో ఉన్న పొడవు గీత మనము మన ప్రభువుతో కలిగి ఉన్న సంబంధమును మరియు అడ్డుగా ఉన్న చిన్న గీత మనం మన తోటి వారితో కలిగి ఉన్న సంబంధమును సూచిస్తున్నాయి అని చెప్పారు. ప్రపంచం వైపు చూడకుండా నేను నా దేవుడు మాత్రమే అని చిన్న మనస్సుతో సమస్తమును విడిచి సత్రములో జీవిస్తున్న సన్యాసి జీవితం అనేది సంపూర్ణ జీవితం అవ్వదు. అది స్వార్థంతో కూడిన జీవితం అవుతుంది. అలా దేవుని మరచి సమాజ సేవను చేయుటలో తృప్తి పొందిన జీవితం కేవలం కాళీ కోటవలె ఉంటుంది. పొడవు గీత మరియు అడ్డు గీత రెండు కలిసినప్పుడు మాత్రమే క్యాప్టిల్ ఎల్ వ్రాయగలము మరియు సంపూర్ణ జీవితం కూడా కలుగుతుంది. ఇంకా ఎల్ వ్రాసినప్పుడు మొదట పొడవు గీతను తరువాత అడ్డు గీతను వ్రాస్తాం. అదేవిధంగా మొదట దేవునితో కలిగి ఉన్న సంబంధం చాలా అవసరం అని స్పష్టంగా చెప్పారు. 

 

వార్త పత్రికలో ఒక హాస్యభావన కనిపించింది. చిరిగిన వస్త్రములు ధరించుకొని మూలన ఉన్న ఒక బిక్షగాడిని చూసిన పోలీస్ దగ్గరకు వెళ్లి జరుగు నీకు ఇక్కడ ఏం పని అని తిట్టడంతో ఆ బిక్షగాడు ఏడుస్తూనే కోటీశ్వరుడైన ఆండ్రూ చనిపోయారు అని చెప్పాడు. వెంటనే పోలీస్ అయితే నీకు ఏంటి అతడు నీ బంధువుడా అని అడుగగా ఆ బిక్షగాడు ఇంకా గట్టిగా ఏడుస్తూ అతడు నాకు బంధువుడు కాడు అని ఏడుస్తున్నాను అని అన్నాడు. అవును సంబంధం చాలా అవసరం. దేవునితో మనం స్థిరమైన సంబంధం కలిగి వుంటేనే అది మనలను ఐశ్వర్య వంతులను చేస్తుంది. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుట, ఒకని నొకడు ప్రేమించు కొనుట అనేది సంపూర్ణముగా జీవించే జీవితం అవుతుంది. 

- శ్రీమతి. బ్యూలా సెల్వరాజ్ గారు.

 

ప్రార్ధన అంశం:-

దేవుడు సృష్టించిన జీవితం అనే అంశం పై రెండు భాగాలుగా బయలుపరుస్తున్న పుస్తకాల ద్వారా అనేక మంది చిన్న పిల్లలు యేసుని ప్రేమను కనుగొను లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet