Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.05.2022
Share:

By Village Missionary Movement

Saturday, 07-May-2022

దిన ధ్యానము(Telugu) 07.05.2022

 

అంశం:- దుష్టత్వం.

 

"సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి" - ఎఫెసీయులకు 4:31

 

దుష్టత్వమునకు ఆంగ్లంలో మాలిస్ అని అర్థం. దీని అర్థం చెడు ఉద్దేశం లేదా ఇతరులకు కీడు చెయ్యాలి అని ఆశ అని చెప్పవచ్చు. అనగా మనం ద్వేషించే వ్యక్తి పైన ఏదో ఒక విధంగా దాడిచెయ్యడం. తనకు నమస్కారం చెయ్యని మొర్దేకైను మరియు యూదుల అందరిని బొత్తిగా నిర్ములం చెయ్యాలి అని హామాను చెసిన ప్లాన్. తప్పు చెయ్యని నాబోతును ఏజెబెలూ అబద్దాపు సాక్ష్యం చెప్పించి చంపించుట. సహాయం అడిగి వచ్చిన దావీదు దాసులను నాబాలు అవమానపరచి పంపించుట. ఇవన్నియు దుష్టత్వము యొక్క వ్యక్తీకరణలు అగును. ఒకవేళ వీరందరూ చాలా జ్ఞానంతో నడుచుకున్నాము అని అనుకొనవచ్చు కాని ఈవిధమైన జ్ఞానం దయ్యముల వంటిదై యున్నదని యాకోబు పత్రిక 3:15 లో చదువుతున్నాం. ఒకని మనస్సును బాధపెట్టటం, వారిని అవమాన పరచటం వంటివి ఏమి చేసినా అది దుష్టత్వమే. చిరునామా లేకుండా వ్రాసిన పత్రిక, పుకార్లు చెప్పటం దొంగ చాటుగా మాట్లాడటం , పొరుగువానిపై ఉన్న నిందను ఇతరులకు ప్రకటించటం మనం ద్వేషించే మంచి వారి యొక్క స్వభావమును, సత్క్రియలను ప్రచురం చేయకపోవడం. వారు చేసే పనులలో నేరం వెతకటం వంటి అన్ని పనులు దుష్టత్వం తో నిండినవే. మూర్ఖుని యోచన పాపము అని సామెతలు 24:9 లో మనం చదువుతున్నాం. జీఫీయులు తమ రాజైన సౌలు మెచ్చుకోవాలని అరణ్యములో కొండ స్థలమందు దాగియున్న దావీదును అప్పగించిన విధముగా ఉన్నత స్థానంలో ఉన్నవారు మనలను మెచ్చుకోవాలని అన్యాయం చేయటం కూడా దుష్టత్వమే. యోసేపు నీతిమంతుడై యున్నందున మరియను అవమానపరచనొల్లక రహస్యంగా మరియను విడనాడ ఉద్దేశించెనని పరిశుద్ధగ్రంధం చెబుతుంది. అవును నీతిమంతులు దుష్టత్వమునకు చోటియ్యరు. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి. అని 1పేతురు 2:16 లో వ్రాయబడి యున్నది. లోబడదామా?

- సహోదరి.గీతా రిచర్డ్ గారు.

 

ప్రార్ధనా అంశం:- 

గ్రామాలలో వి.బి.యస్ కు సిద్ధపడుటకు మన యూట్యూబ్ ఛానల్లో బయలుపడుతున్న కార్యక్రమాల ద్వారా గ్రామాలలో చిన్న పిల్లల పరిచర్య చేయుటకు అనేకులు ముందుకు వచ్చులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet