Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.05.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 08-May-2022

దిన ధ్యానము(Telugu) 08.05.2022 (Kids Special)

 

అంశం:- కోకిల గానం.

 

"నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును" - కీర్తనలు 34:1

 

హాలో! పిల్లలు పక్షుల శబ్దములు విన్నారా? నేను విన్నాను కోకిల పాడుతుంది, కోడి కూస్తుంది, కాకులు అరుస్తాయి, చిలుక మాట్లాడుతుంది. అవన్నీ విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు రెండు కోకిలలు మాట్లాడుకుంటున్నాయి. పిల్లలు రండి రండి ఆ రెండు కోకిలలు ఏమి మాట్లాడుకుంటున్నాయో విందాం. 

 

అందమైన చెట్టు కొమ్మపై రెండు కోకిలలు కూర్చొని పాడుతూ ఉన్నాయి. వేకువజామునే లేచి దేవుని స్తుతిస్తూ పడుతూ ఉన్నాయి. ఒక కోకిల పాడటం ఆపివేసి ఇంకొక కోకిలతో అక్కడ చూడు ఎంతమంది మనుష్యులు వెళుతూ ఉన్నారో. కొంతమంది ఉద్యోగమునకు, పనికి వెళ్తుఉన్నారు. కొంతమంది బ్యాంకుకు వెళ్లి చాలా డబ్భులు సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు అని మీగురించి కూడా మాట్లాడుకుంటున్నాయి చూడండి. అవును అటువైపు చూడు అని ఇంకొక కోకిల మాట్లాడటం మొదలుపెట్టింది. మూడవ అంతస్థులో ఇల్లు కట్టుకున్నారు అందులో కొంతమంది హోటల్ కి వెళ్తూ ఉన్నారు. కాని వారి ముకాలపై సంతోషమే లేదు. ఎవరూకూడా నవ్వట్లేదు మనలా దేవున్ని స్తుతించి పాడాలని ఆశ వారికి లేదు. ఎందుకు వీరంతా ఇలా ఉన్నారు? సంతోష పడేంతగా మన చేతుల్లో సెల్ ఫోన్ కూడా లేదు. కాని మనం ఎంత సంతోషంగా దేవున్ని స్తుతిస్తూ పాడుతున్నాం. ఇంకొక విషయం మనకు ఆహారం కూడా లేదు కదా! ఇలా మాట్లాడుతూ ఇంకొక కోకిల మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నట్లు వీరికి లేరేమో అని చెప్పి తమ సంభాషనను ముగించి కూ..... కూ........ కుకు అంటూ పాడుతూ దేవున్ని స్తుతించడం మొదలు పెట్టాయి. 

 

చిన్న పిల్లలారా! కోకిల మిమ్మల్ని చూసి మాట్లాడి ఉంటే మా వలె మీరు కూడా వేకువ జామున లేచి దేవున్ని స్తుతించి పాడండి అని చెబుతుంది కదా! అవును మీ ఆవసరతలు అన్నింటినీ ఎరిగిన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తుకు మీ మొదటి సమయమున ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోష పడతారు. మిమ్మల్ని ఆశీర్వాదిస్తారు. ఏంటీ పిల్లలు యేసయ్యను స్తుతించి పాడుటకు రెడీ కదా. సూపరో సూపర్. బాయ్

- శ్రీమతి. జీవా విజయ్ గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet radissonbet nesinecasino betbey cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/