Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.05.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 10-May-2022

దిన ధ్యానము(Telugu) 10.05.2022

 

అంశం:- ఎబెద్మెలెకు ఎక్కడ

 

"అప్పుడు-ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము" - 2సమూయేలు 10:12

 

కుమార్ అనే ఒక సహోదరుడు తన 17వ సంవత్సర వయస్సులో బహు క్రూరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తుని తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. తరువాత తన బంధువులకు, స్నేహితులకు తెలిసిన వారికి ఇలా అందరికి యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఉత్సాహంగా ప్రకటించాడు. కొంతమంది తన మాటలను గమనించి విన్నారు. కాని చాలా మంది తనను ఎటకారం చేసి తిట్టి పంపించేసేవారు. ఇందువలన ఆ కుమార్ భయపడి ఇకపై నేను మాత్రమే దేవున్ని నమ్ముతాను వేరే ఎవరికి దేవుని ప్రేమ గురించి చెప్పాను అని నిర్ణయించుకున్నాడు. తను కళాశాల విద్యను పూర్తి చేసి ఒక కంపెనీలో పని చేయుటకు చేరాడు. అక్కడ దొరై అనే ఒక స్నేహితునికి దేవుని గురించి చెప్పాలని కుమార్ ని ప్రభువు ప్రేరేపించారు. కాని కుమార్ మాత్రం మనసుని కఠిన పరచుకొని దురై తనను ఎటకారం చేస్తాడు అని చెప్పి తన స్నేహితుడైన దురై కు యేసుని ప్రేమ గురించి చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు తనను ప్రతి రోజు ప్రేరేపిస్తూ ఉండేవారు కాని తను దేవుని ప్రేమను వివరించలేదు. ఒకరోజు రోడ్డు ప్రమాదంలో దురై మరణించాడు. ఈ సంగతి తెలిసి కుమార్ యొక్క హృదయం తప్పుచేసాను అనే భావనతో కృంగిపోయింది. హృదయం వత్తిడికి గురైంది. తను ఆ వత్తిడి నుండి విడుదల పొందుటకు కొన్ని సంవత్సరాలు అయ్యాయి. దీనికి కారణం సువార్తను ప్రకటించుటలో కుమార్ కి ఉన్న భయం మరియు అధైర్యమే. 

 

ప్రవక్త అయిన యిర్మీయా తన కాలంలో జీవిస్తున్న యూదులకు రాజుకు విరోధముగా దీర్ఘ దర్శనం చెప్పినప్పుడు అతనిని ఒక గోతిలో దించేశారు. అతను అందులో మునిగి మరణించుటకు సమీపమైనప్పుడు ఎబెద్మెలెకు అనే వ్యక్తి ధైర్యముగా రాజు యొద్దకు వెళ్ళి యిర్మీయా ను విడుదల చేయమని అడిగి అతని ప్రాణమును కాపాడాడు. ఒక రాజ్యమే యిర్మీయా ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అతనిని కాపాడిన ఎబెద్మెలెకు యొక్క ధైర్యము ప్రశంసనీయమైనది.

 

ప్రియమైన వారలారా! ఒకవేళ యిర్మీయా మరణించి ఉంటే దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. కాని ఈనాడు చుసినట్లయితే అనేకమంది ప్రజలు పాపమనే ఊబిలో పడి నిత్యమనే మరణమునకు నేరుగా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి ప్రజలను ఆ పాపపు బురదలో నుండి లేపుటకు కుమార్ వాలె భయం, సిగ్గు తో నిండినవారై తప్పించుకుంటున్నామా? ధైర్యముగా ఉన్న ఎబెద్మెలెకులు ఎక్కడ ఉన్నారు? 

 

ప్రార్ధనా అంశం:-

మిషనరీస్ నివాసముండి శిక్షణ పొందుటకై మిషనరీ గృహాలు కట్టుటకు 2లక్షల రూ. అవసరమై యున్నది. ఈ అవసరతలను దేవుడు సంధించులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet