Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.05.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 17-May-2022

దిన ధ్యానము(Telugu) 17.05.2022

 

అంశం:- సరళత.

 

"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది" - 1తిమోతికి 6: 6

 

ఒక అందమైన సాయంత్ర సమయం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుని చూడటానికి తమ సీనియర్ విద్యార్థులు వచ్చారు. ఆ ఉపాధ్యాయుడు కూడా వారిని స్వాగతించి మీ ఉద్యోగం మరియు జీవితం ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. ప్రక్కన ఉన్న భార్యను టీ తీ్ని. . రమ్మని చెప్పారు. అదేవిధంగా ఆమె చెవిలో ఒక రహస్యమును కూడా చెప్పి పంపించారు. సంభాషణ కొనసాగుతూనే ఉంది. మేము ఎంత సంపాదించిన సరిపోవడం లేదు అని విరక్తిగా మా జీవితములు గడుస్తున్నాయి అని విద్యార్థులు తమ అసంతృపి అయిన జీవితములను బయలు పరుస్తున్నారు. ఇంతలోనే టీ వచ్చింది. కాని అవి అన్నీ రకరకాల కప్పుల్లో తీసుకొని వచ్చారు. విద్యార్థులు ఒకరితరువాత ఒకరు అందంగా మంచిగా ఉన్న కప్పులను తీసుకొన్నారు. సాధారణమైన కప్పులో ఉన్న టీ మాత్రం మిగిలిపోయింది. అప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులారా మీరు ఒకరి కంటే ఒకరు మంచి వాటిని ఏర్పరుచుకున్నారు. మీకు ఒకటి తెలుసా అన్ని కప్పుల్లో ఉన్న టీ ఒకే విధంగా తయారు చేయబడింది ఇదేవిధంగా మితిమీరిన మీ అంచనాలు, ఆశలు మీ జీవితమును అసంతృప్తి గల జీవితముగా మార్చి మిమ్మును గలిబిలి చేసాయి. సంతృప్తి సహితమైన జీవితమును జీవించుటకు అలవాటు చేసుకోనండి అప్పుడు మీ జీవితం చక్కగా ఉంటుంది అన్నారు ఉపాధ్యాయుడు. 

 

మనం పరిశుద్ద గ్రంధంలో ఎస్తేరు గ్రంధం చదివి ఉంటాం కదా. మొర్దేకై తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేరును పెంచి రాజ భవనములో 127 సంస్థానములకు రాణిగా మార్చిన తరువాత కూడా తాము ఎవరు అని తెలియ జేయకుండా తను ద్వారం యొద్ద చేస్తున్న పనిని కొనసాగించాడు. తన యొక్క సరళతకు ఇంత కన్నా వేరే ఉదాహరణ అవసరం లేదు మొర్దేకై యొక్క సరళత మరియు తనకు ఉన్న దైవ భక్తి రాజు యొక్క ప్రాణమును కాపాడుటలో తన యొక్క గొప్ప తనాన్ని తెలిసేలా చేయని మనస్సు తన ప్రజల కోసం దయగలిగే హృదయం ఇలా తన యొక్క వినయం కలిగిన స్వభావం వంటి మంచి గుణాలు ఆ షూషను కోటలో అతనిని గొప్పగా చేశాయి.

 

అవును ప్రియమైన దేవుని పిల్లలారా! సంతృప్తి లేని జీవితం కలిగి ఉన్నారా? జీవితం చేదుగా ఉన్నదా? మనస్సు విసుగుగా ఉన్నదా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువ బడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. ఆయన పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తువాడు. ప్రదానులతో తన ప్రజల ప్రదానులతో వారిని కూర్చుండ బెట్టువాడు మన ప్రభువే కదా. మొర్దేకై కు ఉన్న మనస్తత్వం మీకున్నదా? ద్వారము నొద్ద కూర్చున్న మొర్దేకై ను ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా మిమ్మును కూడా దీవిస్తారు. హల్లేలూయా!

- సహోదరి. మంజులా గారు

 

ప్రార్ధన అంశం:

మన గెత్సమనే క్యాంపస్ లో జరిగే వైద్యసేవ ద్వారా సందింపబడే గ్రామ ప్రజల ఆత్మ, శరీరం స్వస్థత పొంది రక్షింపబడేలా ప్రార్ధిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet radissonbet nesinecasino betbey cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/