Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.05.2022
Share:

By Village Missionary Movement

Friday, 27-May-2022

దిన ధ్యానము(Telugu) 27.05.2022

 

అంశం:- ఎవరి మాటలు.

 

"యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు" - కీర్తనలు 1:2

 

ఒక సారి నేను మా మమయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా మామయ్య కళాశాలలో పని చేస్తూ దేవుని పరిచర్య కూడా చేస్తూ ఉండేవారు. ఒక రోజు ఒక స్త్రీ మా మామయ్యకు ఫోన్ చేసి మా సంఘపు పాస్టర్ గారి భార్య నా మనస్సు నొచ్చుకొనేలా మాట్లాడారు. ఆమె మాట్లాడిన మాటలు నేను మర్చిపోలేను.ఆ మాటలు నన్ను ఏ పనిని కూడా చెయ్యకుండా అడ్డుకుంటున్నాయి అని చెప్తూఉంది. మా మామయ్య ఆమె మాటలను మార్చి రెండు ప్రశ్నలను అడిగారు. మీరు ఆలోచించేది యేసుక్రీస్తు యొక్క మాటలా లేక యెజెబెలు యొక్క మాటలా అని. కొంత సమయం తరువాత నేను మా మామయ్య దగ్గరకు వెళ్ళి అదేంటి యేసుక్రీస్తు యొక్క మాటలా యెజెబెలు యొక్క మాటలా అని ఆడిగారేంటి అని అడిగాను. అందుకు అతను ఏలీయా గురించి మనందరికీ తెలుసు. అతను చాలా ధైర్యం కలిగిన ప్రవక్త. చాలా శక్తివంతమైన కార్యములు చేశారు. కాని అంత గొప్ప ధైర్యశాలి ఒక్కసారిగా యెజెబెలు పంపిన వర్తమానము విని భయపడి తన ప్రాణమును తీసుకోమని చెప్పుటను చూస్తున్నాం. అంతకు ముందు యెహోవా అతని ద్వారా చేసిన అద్బుతములు చాలా ఆశ్చర్యకరమైనవి. సారేపతు విధవరాలి ఇంట్లో జరిగిన అద్భుతం, అతను ప్రార్ధించి నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిని దహించిన అద్భుతం, తరువాత ఇంకొక సారి అతను ప్రార్ధించినప్పుడు సంవత్సరం అంతా కురవని వర్షం కురిసింది. ఇలా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ముందు నిలబడిన నేను అని ధైర్యముగా చెప్పే ఏలీయా 1రాజులు 19:4 లో నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేశారు. 

 

అవును ప్రియమైన వారలారా! అనేక సమయాల్లో మనం కూడా దేవుని మాటలను ధ్యానించ కుండా మనం మన హృదయం కఠిన పరచుకొని యెజెబెలు వంటి లోకస్తుల మాటల వలన మన హృదయమును క్రుంగజేసుకొంటున్నాం. కాని మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన మాటలు విని వాటి ప్రకారము నడుచుకొన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనకు ధైర్యమును, బలమును, విజయమును ఇచ్చుటకు శక్తిమంతుడై యున్నారు అనేది మర్చిపోవద్దు. ఈరోజు మనం ఎవరి మాటలను వింటున్నాం? యేసుక్రీస్తుని మాటలా లేక యెజెబెలు మాటలా? 

- శ్రీమతి. స్టెఫి రాక్ సన్ గారు

 

ప్రార్ధన అంశం:

గృహ ప్రార్ధనలు జరగాలని తీసుకున్న తీర్మానం ద్వార ప్రార్ధనా గృహాలు అభివృద్ధి చెందేలా ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş