Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.05.2022
Share:

By Village Missionary Movement

Saturday, 28-May-2022

దిన ధ్యానము(Telugu) 28.05.2022

 

అంశం:- ధూళి పట్టిన ఇల్లు.

 

"శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను" - రోమీయులకు 8: 3-4

 

ధర్మశాస్త్రము చేయునది ఏమిటి ధర్మశాస్త్రము చేయలేనిది ఏమిటి అనే ఈ విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రము వలన పాపము అంటే ఏమిటి అని దానిని మనం తెలుసుకొనగలం. ధర్మశాస్త్రము మోషే చేతికి ఇవ్వబడక మునుపే లోకములో పాపము ఉండేది. అయితే ధర్మశాస్త్రము ఇవ్వబడిన తరువాత పాపమైన వాటిని పాపము అని తెలియజేయబడింది. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము మరణమును తీసుకొని రాలేదు గాని పాపమే మరణమును తీసుకొని వచ్చింది. మోక్ష ప్రయాణం పుస్తకము యొక్క రచయిత దీనిని వివరించి వ్రాసిన వర్ణనను చూద్దామా?

 

జాన్ బనియన్ వ్రాసిన మోక్ష ప్రయాణం పుస్తకం యొక్క కథానాయకుడు ఒక రోజు ఒక సువార్తికుని కలిసాడు. వచ్చే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి చాలా దూరంలో ఉన్న ఒక ఇరుకైన ద్వారం చూపించి అతనిని ప్రేమతో పంపించాడు ఆ సువార్తికుడు. క్రిస్టియన్ ఆ ఇరుకైన మార్గం గుండా వెళ్లి ఒక వర్ణకారుని ఇంటికి చేరుకున్నాడు. ఆ వర్ణ కారుడు ఇంత వరకు శుభ్రపరచని ఒక గడిలోనికి ఆ క్రిస్టియన్ ను తీసుకొని వెళ్లాడు. ఆ గది అంతా ధూళితో నిండివున్నది కాబట్టి శుభ్రపరిచే వాడిని పిలిచి ఆ గదిని తుడవమని చెప్పాడు. ఆయన చీపురు పట్టుకొని ఆ గదిని తుడుస్తూ ఉంటే ధూళి పొగవలె లేస్తూవుంది. క్రిస్టియన్ ఊపిరి పీల్చుకోలేకపోయాడు. ఆ వర్ణకారుడు ప్రక్కనే ఉన్న స్త్రీతో కొద్దిగా నీళ్లు తీసుకొని వచ్చి ఆ గది అంత చల్లి తుడవమని చెప్పాడు. నీళ్లు చల్లిన తరువాత ఆ గదిని శుభ్రపరచడం చాలా సులభం అయ్యింది. అయ్యా దీని యొక్క వర్ణన ఏమిటి అని క్రిస్టియన్ ఆ వర్ణకారుడ్ని అడిగాడు. ఈ గది మనుష్యుని యొక్క హృదయం, ధూళి ఆతనిని అపవిత్ర పరిచే పాపం, మొదట ఉన్నది ఉన్నట్టుగా తుడిచేదే ధర్మశాస్త్రము నీళ్లు చల్లి తుడిచే ఆ స్త్రీ యేసుక్రీస్తు యొక్క సువార్త. ధర్మశాస్త్రము మన పాపములను బయలుపరచడం వలన అవి పెరుగుతువున్నాయి. యేసుని గూర్చిన సువార్తను మనం అంగీకరించినప్పుడు మన పాపము తొలగి మన హృదయం పరిశుద్ధం అవుతుంది. అప్పుడే మహిమ గల రాజు ఆ హృదయమలో నివాసం ఉండగలరు అని క్రిస్టియన్ కు అర్థం అయ్యేలా చెప్పాడు ఆ వర్ణకారుడు. అవును ఏ మనుష్యుడు ధర్మశాస్త్రము యొక్క క్రియల వలన నీతిమంతునిగా తీర్చబడడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడతాం. మన యొక్క పాపములు ధర్మశాస్త్రము వలన కాదు యేసుని యొక్క రక్తం ద్వారా కడగబడగలవు. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కలిగే మేలులు గ్రహిద్దాం. విజయముతో విడుదలతో జీవిద్దాం.

- శ్రీమతి. బ్యూలా సెల్వరాజ్ గారు

 

ప్రార్ధన అంశం:

7000 మంది మిషనరీల ద్వార ఒక లక్ష గ్రామాలను సందించాలనే ప్రయాసలో దేవుని హస్తం తోడుండేలా ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet cashwin grandpashabet radissonbet palacebet amgbahis cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet