Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.06.2022
Share:

By Village Missionary Movement

Thursday, 02-Jun-2022

దిన ధ్యానము(Telugu) 03.06.2022

 

అంశం:- అదృశ్యమైనవే నిత్యమైనవి.

 

"ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు" – 2 కోరింథీయులకు 4:18

 

పౌలు భక్తుడు కోరింథీ సంఘమునకు వ్రాస్తూ పైన చెప్పబడిన వాక్యాన్ని వివరించినప్పుడు దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటినే చూచుకొని సహనముతో పరిగెత్తుదము అంటున్నారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకొనుటకు జాన్ బనియన్ యొక్క మోక్ష ప్రయాణము అనే పుస్తకములో ప్రయాణం చేసి అతని చెప్తున్న కార్యాన్ని వినుటకు వెళ్దామా? 

 

ఈ కథ యొక్క హీరో అయిన క్రిస్టియన్ చేతులను పట్టుకొని లాక్కొని ఒక చిన్న గది లోనికి తీసుకు వెళ్లి అక్కడ వివరణ ఇచ్చేవారు. అక్కడ ఇద్దరు చిన్నారులు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. క్రూరమృగముతో గెంతుతూ ఉన్నాడు కోపిష్టి ప్రశాంతమైన మొఖముతో నెమ్మది గలవాడిగా ఉంటున్నాడు సహనము. కోపిష్టి ఎందుకు ఇంతగా కోపంగా ఉంటున్నాడు అని క్రిస్టియన్ అడుగుతున్నాడు. దానిని విన్న వాడు అడిగిన ఒక వస్తువు పొందుకొనుటకు ఇంకా సంవత్సరం పడుతుంది అని తల్లిదండ్రులు చెప్పేసారు. వాడైతే ఇప్పుడే దానిని అడుగుతున్నాడు అందుకే వాడు కోపపడుతున్నాడు. కాని సహనం అయితే ప్రశాంతంగా వేచి ఉన్నాడు అని వివరణ ఇచ్చారు వివరించే వ్యక్తి.

 

అప్పుడు ఒకాయన ఒక సంచినిండా బంగారములను, మాణిక్యములను తీసుకొచ్చి ఆ కోపిష్టి కాళ్ళ క్రింద పడేసారు. సహనాన్ని చూసి హేళనతో నవ్వినవాడుగా ఆ కోపిష్టి విలువైన నిధిని అంతటిని తమ చేతుల్లో తీసేసుకున్నారు. కాని కొంత సమయానికే వాటన్నింటిని ఖర్చు చేసాడు. వాడికి ధరించుకొనుటకు కూడా మంచి బట్టలు లేకుండాపోయాయి. కోపిష్టి ఈ లోక ప్రజలకు సాదృశ్యం. సహనం అయితే రాబోతున్న నూతన లోకపు ప్రజలకు సాదృశ్యం. కోపిష్టి ఎలా వెంట వెంటనే పొందుకోవాలి అని తొందరపడ్డాడో అలాగే ఈలోక ప్రజలు కూడా అన్నింటినీ వెంటనే పొందుకొనుటకు తొందరబడుతున్నారు.. మన మరణం తరువాత గల జీవితం గురించి ఎవ్వరు చింతించుట లేదు. కోపిష్టి అయితే తన కున్న నిధిని త్వరగా ఖర్చు చేసినట్లుగానే ఈలోకపు సంతోషం కూడా త్వరలో గతించి పోతుంది. మనము నిత్యజీవాన్ని కోరుకోవాలి అన్నదానికి ఇది ఒక పాఠము అని వివరణ ఇచ్చేవాడు వివరించాడు. 

 

అవును ఈ లోకంలో కనబడుతున్న అందమైన కార్యములు అన్నీకూడా ఒక రోజు అంతం అయిపోతుంది. పరలోక మహిమ ఎన్నడూ మారనిది. లాజరు ధనవంతుడు ఉపమానంలో అబ్రాహాము చెబుతున్న వాటిని వినండి. నీవు భూమిపైన జీవించినప్పడు నీకు కలిగిన సమస్త మేలులను అనుభవించావు కాని లాజరు అయితే అలా కాదు కీడులనే అనుభవించాడు. అనేదాన్ని గుర్తుంచుకొనుము ఇప్పుడు ఆయన ఓదార్చ బడుతున్నాడు కాని నీవైతే శ్రమ అనుభవిస్తున్నావు. మనము ఈ లోకానికి చెందిన వారమా? లేక నిత్య జీవమునకు చెందిన వారమా? 

- శ్రీమతి. బ్యూలా సెల్వరాజ్.

 

ప్రార్ధనా అంశం:-

మిషనరీల యొక్క కుటుంబాలు, పిల్లల యొక్క ఆరోగ్యం మరియు రాబోతున్న సంవత్సరంలో గల వారి యొక్క చదువు కొరకు కావాల్సిన ధన ఆవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al superbetin pashagaming jojobet jojobet giriş instagram unban service instagram unban service matbet matbet