Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.06.2022
Share:

By Village Missionary Movement

Sunday, 05-Jun-2022

దిన ధ్యానము(Telugu) 05.06.2022

 

అంశం:- సహాయం చేసే చేతులు.

 

"మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి" - కొలస్సీయులకు 3:12

 

హాయ్ పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? సెలవుల్లో చాలా ఎంజాయ్ చేశారు కదా? చుట్టాల ఇళ్లకు మరియు టూర్, పిక్ నిక్ లకు ఇలా చాలా చోట్లకు వెళ్లి సంతోషించి ఉంటారు. అంతే కదా ఒకే! ఈరోజు ఇతరులకు ఎలా సంతోషపెట్టాలో తెలుసుకోవడానికి ఒక కథ విందమా? సుశీల అక్క ఒక్క రోజులో ఎంత మందికి సహాయం చేసిందో చూద్దామా? 

 

సుశీల ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే కనికరం గల పిల్ల. ఒక రోజు చాలా నీరసంగా ఉన్నప్పటికీ ఎప్పటి లాగానే ఉదయాన్నే లేచి మొఖం కడుక్కొని అమ్మ దగ్గరకు వెళ్లి టీ తీసుకొని త్రాగి ఇంటి ప్రక్కనే ఉన్న తోట వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న మొక్కలు, పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఆ మొక్కలు అన్నింటికి నీళ్ళు పోసింది. మీరు కూడా మొక్కలను పెంచుతారా? అప్పుడు తాను పెంచుతున్న పిల్లి మియమ్ మియమ్ అని అరుస్తూ వచ్చింది. ఆ పిల్లి కాళ్ళు గాయపడి ఉండడంతో దానికి మందు పూసి నొప్పేట్టదు త్వరగా తగ్గిపోతుంది అని చెప్పింది సుశీల. వెంటనే పిల్లి మియమ్ అంటూ థాంక్స్ చెప్పింది. ఆ తరువాత సుశీల ఇంటి ద్వారం యొద్ద కూర్చొని ఉన్నప్పుడు ఒక చిన్న బాలుడు సైకిల్ తొక్కుకొంటు వచ్చాడు. సైకిల్ తొక్కడం కొత్త కావడంతో తనకు కష్టంగా ఉండేది. దీనిని గమనించిన సుశీల ఆ బాలుడి దగ్గరకు వెళ్లి తనకు సైకిల్ తొక్కడం నేర్పించింది. ఆ బాలుడు కూడ చాలా సులువుగా నేర్చుకున్నాడు.

 

 కొంచం సమయం తరువాత ఒక మామ్మ కాయగూరలు కొనుక్కొని ఆ దారిలో వెళ్తున్నారు. అక్కడ రాయి ఉండుట చూడ కుండా తన్నుకొని క్రింద పడిపోయారు. కాయగూరలు అన్నీ చెల్లా చెదురైపోయాయి. ఆ మామ్మ యొక్క స్వరం విని సుశీల పరిగెత్తుకొని వచ్చి ఆ కాయగూరలు అన్నింటినీ ఏరి ఆ మామ్మకు ఇచ్చి కాళ్లకు గాయం తగిలిందా మామ్మ గారు అని ప్రేమగా అడిగింది. చిన్న పిల్లవైన ఎంత ప్రేమగా ఉన్నావమ్మా అని మెచ్చుకొని థాంక్స్ చెప్పారు ఆ మామ్మ గారు. సుశీల కూడా మామ్మకు థాంక్స్ చెప్పింది. ఆ హాలిడేస్ అన్నీ కూడా సుశీల అక్కకు చాలా సంతోషంగా ఉండేవి.

 

చిన్న పిల్లలారా! మీరు కూడా మీ చిన్న చేతులతో ఇతరులకు సహాయం చేసినప్పుడు యేసయ్య సంతోష పడతారు. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు మేలులు చేస్తూనే జీవించారు. మీరు కూడా అలానే చెయ్యాలి. పిల్లలు కనికరం గల మనస్సు ఉంటేనే సహాయం చెయ్యగలం. అందువలన కనికరం కోరుకొనండి యేసయ్య పిల్లల వలె జీవించండి. 

- సిస్టర్. ఏ. బ్యూలా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al superbetin pashagaming jojobet jojobet giriş instagram unban service instagram unban service matbet matbet