By Village Missionary Movement
Wednesday, 08-Jun-2022దిన ధ్యానము(Telugu) 08.06.2022
అంశం:- యెహోవా యందు నమ్మకం.
“యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు" - కీర్తనలు 40:4
జేమ్స్ అనే చిన్న వాడికి పుట్టినప్పటి నుండి కాళ్ళు చేతుల్లో సరైన ఎదుగుదల లేదు. కాళ్ళకు కొన్ని వేళ్ళు మాత్రమే తిన్నగా ఉంటాయి. వాటి సహాయంతోనే పనులన్నింటిని చేస్తూ వచ్చాడు. పాఠశాలలో తాను చేరినప్పుడు చాలా మంది సానుభూతితో మరికొంత మంది హేళనతో చూసే వారు. జేమ్స్ తన స్థితిని గూర్చి కృంగి ఇక పాటశాలకు వెళ్ళాను అని నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండి చదువుకొనేల ఏర్పాటు చేశారు. పాటశాల పాఠాలతో పాటు బైబిల్ కూడా నేర్పించారు. జేమ్స్ కూడా బైబిల్ బాగా చదివాడు. దేవుని మీద నమ్మకం ఉంచడం ప్రారంభించడం వలన తనను గూర్చిన బాధను మర్చిపోయాడు. ఎంత ఆశ్చర్యం అంటే ఈనాడు అతను బైబిల్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.
బైబిల్లో యోబు గ్రంధం శోధన సమయాల్లో మనలను బలపరిచేటటు వంటి పుస్తకం. ఒక్కరోజులోనే సమస్తమును కోల్పోయినప్పటికి యెహోవాను దూషించక యెహోవా మీద వున్న నమ్మకమును విడిచిపెట్టక యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకోనెను అని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు యోబు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ప్రయోజనము కాదనియు నేను తెలుసుకొని యుంటిని అని యోబు గ్రంధం 42వ అధ్యాయం 2వ వచనంలో చూడ గలం. యెబు అంతగా యెహోవాను నమ్మెను.
ప్రియమైన వారలారా! యోబు యొక్క నమ్మకం దేని పైన ఉన్నది, ఎవరి పైన ఉన్నది. శరీర బలం పైన లేక డబ్బుపైన లేక వస్తువుల పైన లేక మనుష్యుల పైన. సమస్తమును ఒక రోజు మారిపోవును. దేవునికి ఇష్టానుసారమైన దావీదు చెబుతున్నాడు మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ఆస్తి మీద నమ్మకం ఉంటే ఆస్తి లేనప్పుడు కృంగిపోతాం. దేవుడు మారనివాడు ఆయన సర్వ శక్తిమంతుడు. అతని మీద నమ్మకం ఉన్నట్లయితే అన్ని సమయాల్లో యోబు వలె కృంగిపోకుండా ఉండగలం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అని యిర్మీయా గ్రంధం 17వ అధ్యాయం 7వ వచనంలో చూసిన విధముగా మనము కూడా ధన్యులమై యుందుము గాక!
- ఎమ్. హెప్సి మనుయేల్ జయరాజు గారు.
ప్రార్ధనా అంశం:-
ప్రత్యక్షంగా యవ్వనస్తుల కోసం జరుగుతున్న కార్యమాల ద్వారా నడిపించబడే యవ్వనస్తుల కొరకు ఇంకా నూతనముగా ప్రార్ధనా కూటములు ప్రతి గ్రామంలో జరుగులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250