Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.06.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 12-Jun-2022

దిన ధ్యానము(Telugu) 12.06.2022 (Kids Special)

 

అంశం:- ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును" - కీర్తనలు 18:29

 

హాయ్ పిల్లలు సెలవుల్లో బాగా ఎంజాయ్ చేసి చాలా రోజుల తరువాత స్కూల్ కి వెళ్ళడానికి కష్టంగా ఉందా? రెండు రోజుల్లో అలవాటు అయిపోతుంది. త్వరగా లేచి మిమ్మల్ని త్వరగా రెడి చేసి స్కూల్ బస్సులో లేదా ఆటోలో మిమ్మల్ని పంపించే వరకు అమ్మ రెస్ట్ తీసుకోరు. ఉదయాన్నే లేచి వంటచేసి మీకు మరియు ఇంటికి అవసరమైన పనులన్నింటిని చేస్తున్న తల్లిదండ్రుల మాటలను నిర్లక్ష్యం చేయకూడదు సరేనా? 6గంటలైయింది, 7 గంటలైయింది లే అనే చెప్పడానికి ముందే నీవు లేచి ప్రార్ధనా చేసుకొని బైబిల్ చదివి స్కూల్ కి వెళ్ళాలి. ఈ నూతన తరగతిలో చక్కగా చదువుకొనుట ప్రయత్నించడం అనేది చాలా ప్రాముఖ్యం. 

 

ఈరోజు దీనుని గూర్చిన కథను వినబోతున్నాం. విందమా?

ఒక రోజు ఒక రాజు తన ఊరి ప్రజలతో మీలో ఎవరు బలవంతులో తెలుసుకోవడానికి ఒక పోటీ పెడతాను పోటీలో పాల్గొనే వారు ఒక వారం రోజుల్లో రాజా భవన మునకు రావాలి అని చెప్పారు.అందులో గెలిచిన వారికి 1000 బంగారు నాణెములు ఇవ్వబడును అని చెప్పడంతో ఆ ఊరి వారాంతా చాలా సంతోషంగా ఆ పోటీకి సిద్ధపడ్డారు. చాలా మంది వ్యాయామం చేశారు. మరికొంత మంది మంచి ఆరోగ్య కరమైన భోజనం చేశారు. జిమ్ కి వెళ్లారు. మరికొంత మంది తిని పడుకొనే వారు. రాజు చెప్పిన రోజు వచ్చింది. రాజ భవనంలో ప్రజల యొక్క గుంపు కూడింది. 100 అడుగులు గల చాలా పెద్ద తలుపు మూసి వేయబడి ఉన్నది. చూడటానికి ఇనుము తలుపు వలె ఉన్నది. ఆ తలుపును త్రోసి తెరవాలి అని రాజు చెప్పాడు. ఇంత పెద్ద తలుపును ఎవరు కూడా చేతులతో తెరవలేరు రాజు ఇలా చెప్పారు ఏంటి అని ఒకరికొకరు మాట్లాడు కోవడం ప్రారంభించారు. గుంపులు గుంపులుగా వచ్చిన వారు కూడా ప్రయత్నం చేయలేదు. మనం వెళ్లి తెరవలేకపోతే పరువు పోతుంది అని అనుకొని ఎవరు కూడా ఆ తలుపు దగ్గరకు వెళ్ళలేదు. ఒక చిన్న బాలుడు మాత్రం ఆ తలుపు ప్రక్కకు వెళ్ళాడు. తన రెండు చేతులతో దానిని త్రోసి చూసాడు. అది వెంటనే మ్యాజిక్ చేసినట్లు చక్కగా తెరవబడింది. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఆ తలుపు కేవలం ఒక అట్టతో చేయబడింది. దానిని చూసి ఆ చిన్న వాడిని అందరూ మెచ్చుకున్నారు. రాజు చెప్పిన విధంగా 1000 బంగారు నాణేలు బహుమానం ఆ బాలుడికి ఇచ్చారు. ఏంటి పిల్లలు ప్రయత్నం చేస్తే సాధించ లేనిది ఏదియు లేదు. ప్రయత్నం విజయమును ఇస్తుంది అనేది వినే ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేసి చూపించాలి. నాకు ఈ పాఠం నచ్చదు అనకుండా ప్రభువైన యేసుక్రీస్తు తోడు తో ఈ కొత్త తరగతిలో చదివి చూపించండి విజయం అనే శిఖరాన్ని అందుకోగలరు. సరే పిల్లలు మన ప్రభువైన యేసుక్రీస్తు తోడు తో ప్రయత్నం చేసినప్పుడు విజయం సాదించగలం అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చుకొందామా? 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet