Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.06.2022
Share:

By Village Missionary Movement

Monday, 13-Jun-2022

దిన ధ్యానము(Telugu) 13.06.2022

 

అంశం:- విశ్వాసపు ప్రార్థన.

 

"విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది" - హెబ్రీయులకు 11:1

 

ఇంచు మించు 30 సంవత్సరాలకు ముందు అందరి వలె చాలా ఆశక్తితో పదవ తరగతికి వెళ్ళాను. మా కుటుంబము ఆర్థికంగా చాలా వెనుకబడిన ఉన్న కుటుంబం. ఒక రోజు నేను మా నాన్న దగ్గరకు వెళ్లి మనం ఆర్థికంగా పెరుగుటకు ఏదైనా దారి ఉందా నేను దాని కొరకు ఏమి చెయ్యాలి అని అడిగాను. వెంటనే మా నాన్న గారు నువ్వు పదవ తరగతి బాగా చదివి 420 మార్కులు సంపాదిస్తే చక్కగా పాలిటెక్నిక కళాశాలలో చోటు దొరుకుతుంది. తరువాత మంచి ఉద్యోగంలో చోటు దొరుకుతుంది అప్పడు మన స్థితిని మార్చవచ్చు అని చెప్పారు. అప్పటినుండి బాగా చదవడం ప్రారంభించాను. మా ఇంట్లో విద్యుత్ సదుపాయం లేనందు వలన వీధి దీపాల వద్ద చదవ వలసి వచ్చింది. ఏదో ఒక విధంగా పరీక్షలు పూర్తి అయ్యాయి. నేను వ్రాసిన దాని బట్టి మార్కులు లెక్కిస్తే 380 మార్కులే వచ్చినట్లు ఉంది. ఈ సంగతిని మా నాన్నతో చెప్పాను. దానికి అతను అయితే నువ్వు జిరాక్స్ షాపు లేదా బట్టలు షాపులోనో పనిచెయ్యాలి అని అన్నారు. మా ఇంటి పక్కనే ఉన్న పురజాతి మామ్మ ఏమి చేసిన యేసయ్య యేసయ్య అని చెప్పుటను నేను గమనించాను. ఏంటిది నిలబడిన యేసయ్య పడుకున్న యేసయ్య అని అనుకొంటూ ఆమె యొద్దకు వెళ్లి మీరెందుకు ఇలా అంటున్నారు అని అడిగాను. అందుకు ఆవిడ నా యొక్క ఆరోగ్య స్థితి బాగోక మరణించే పరిస్థితిలో ఉండే దాన్ని వైద్యులు నా చెయ్యి విడిచిపెట్టేసారు ఆ సమయంలో ఒక స్త్రీ నా కొరకు యేసయ్య యొద్ద ప్రార్ధించింది. ఆయన నాకు సంపూర్ణ స్వస్థత కలుగజేశారు అని చెప్పారు. దానిని విని నేను చాలా ఆశ్చర్య పడ్డాను. నేను అడిగిన యేసయ్య అద్భుతం చేస్తారా అని ఆమెను అడిగాను. వెంటనే మామ్మ అవును చేస్తారు అమ్మ అని చెప్పి తనకు ప్రార్ధించడం తెలియదు అని ఆ సహోదరి యొద్దకు నన్ను తీసుకొని వెళ్లారు. ఆ సహోదరి నా కొరకు ప్రార్ధించారు. నేను కూడ యేసయ్య అద్భుతం చేస్తారు అని నమ్మాను. పరీక్షల యొక్క ఫలితాలు వచ్చాయి. ఎంత ఆశ్చర్యం నా తండ్రి చెప్పిన విధముగా నేను ప్రార్దించిన విధముగా 420 మార్కులు వచ్చాయి. అంతే కాదు మంచి పాలిటెక్నికల్ కాలేజీలో నాకు సీటు వచ్చింది. విడ్ మిల్ అనే కరెంటు ఉత్పత్తి చేసే కంపెనీలో యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చారు. ప్రభువైన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించుటకు కృపను అనుగ్రహించారు. ఇప్పుడు ప్రతి వారం సెలవు దినాన్న పరిచర్య చేయుటకు దయను అనుగ్రహించారు. 

 

ప్రియమైన యవ్వనులారా! మనం యేసయ్య యొద్ద విశ్వాసముతో ఏది ఆడిగినను ఆయన నిశ్చయముగా చేస్తారు. హెబ్రీ 11:1లో చెప్పబడిన విధముగా విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. మీరు కూడా చాలా పరీక్షలు వ్రాసి ఉంటారు. విశ్వాసముతో యేసయ్యను అడగండి. మీకు కచ్చితంగా మంచి మార్కులు మరియు మంచి కళాశాలలో సీటు దయచేస్తారు. అది మాత్రమే కాదు జీవితంలో ఎటువంటి పరిస్థితులలో అయిన యేసయ్యనే పట్టుకొనండి. నా జీవితమును ఆశీర్వదించి హెచ్చించిన దేవుడే నిశ్చయముగా మిమ్మును కూడా ఆశీర్వదిస్తారు. ఆమెన్.

- బ్రదర్. మారియప్పన్ గారు

 

ప్రార్ధనా అంశం:-

మోక్ష ప్రయాణం పత్రికలను వ్రాస్తూన్న వారిని దానిని ఎడిట్ చేస్తున్న వారిని దేవుడు విశేమైన జ్ఞానముతో నింపేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet çarkbet çarkbet giriş