By Village Missionary Movement
Wednesday, 15-Jun-2022దిన ధ్యానము(Telugu) 16.06.2022
అంశం:- ఏమేలు కొదువై యుండదు.
"సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు" - కీర్తనలు 34:10
పండిత రమాబాయి గారు దేవునిపైన ఉన్న ప్రేమ వలన పూణే అనే జిల్లాలో కేక్ కా వుంగ్ అనే గ్రామంలో ముక్తి మిషన్ ను ప్రారంభించి ఆదరణ లేని చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు అందరిని ఆదరిస్తు వచ్చారు. చక్కని ప్రార్థన జీవితమును అత్యుత్తమమైన క్రైస్తవ నిబంధనలను కలిగి ఉన్న ఈయన తన హోమ్ లో ఉన్న అనాధ పిల్లలకు మరియు పేద పిల్లలకు పెద్దవారికి ప్రేమతో ప్రత్యేకంగా చూసుకునేవారు. ఒక సారి హోమ్ లో ఉన్న వారు భయం కరమైన ఆహారపు కొరత వలన ఆకలితో అలమటించారు. పండిత రమాబాయి గారు దేవుని పైన విశ్వాసముతో ఆహారం మరియు ఆదాయం కోసం ప్రార్థిస్తున్నారు. ప్రార్థన ముగించే సమయంలో ఒక ధనవంతుడు వారి యొక్క ద్వారం యొద్ద నిలబడి యున్నాడు. లోపలకి రమ్మని పిలిచిన ఒక అమ్మతో అమ్మ నేను ధాన్యమును తెస్తూ ఉండగా నా బండి యొక్క చక్రపు ఛాయా మేకు ఉడిపోవడం వలన మీ హోమ్ ముందు ఆగిపోయింది. బరువును మోయలేక నిలబడిఉన్న ఆ బండిలో గల ధాన్యం మూటలను ఇంటికి లేదా బజారుకు నేను తీసుకొని వెళ్లలేను. కాబట్టి ఈ ధాన్యం మూటలను మీ హోమ్ కే ఇచ్చేస్తాను మీరు వీటిని అంగీకరిస్తారా అని అడిగాడు. ఆ ధాన్యం బస్తాలు తీసుకొని ఆ ధనవంతుని పంపి వేసి మోకాళ్లపై నిలబడి దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.
అవును అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన యెహోవా వారిని ఒక్క లోటు లేకుండా పోషించారు. అలసి, సొలసి ఉన్న ఏలీయా ప్రవక్త కాకులు ద్వారా పోషించారు. అవును మన దేవుడు తన పిల్లల జీవితంలో మహిమను చూపించే దేవుడై యున్నారు.
ప్రియమైన వారలారా! యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై యుండదు. మనం విశ్వాసముతో దేవునికి అడిగే ఏ ప్రార్ధనకైనను ఏదో ఒక దారిలో జవాబు ఇచ్చే శక్తిమంతుడై యున్నాడు.అద్బుతములను చేసే దేవుడు మన జీవితంలో ఆవసరతలు అన్నింటినీ అద్భుతంగా తీర్చుతారు. మేలులను చేస్తారు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. ఆమెన్.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు.
ప్రార్ధన అంశం:-
వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ మరియు ఈ మెయిల్ ద్వారా పంపించ బడుతున్న దినధ్యాన మాటలను చదువుతున్న వారు దేవునితో మంచి ఫలం ఇచ్చేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250