By Village Missionary Movement
Friday, 17-Jun-2022దిన ధ్యానము(Telugu) 17.06.2022
అంశం:- నిత్యమైన బహుమతి.
"పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి” - కొలస్సీయులకు 3:2
నోబెల్ బహుమతి గురించి అందరికి తెలుసు మరి యెబెల్ బహుమతి గురించి తెలుసా? ముఖ్యముగా గణిత శాస్త్రంలో ఉత్తమ సహకారాలు ఇచ్చే బహుమతి యెబెల్ బహుమతి. ఈ బిరుదు ఇంత వరకు 25 మందికి మాత్రమే ఇవ్వబడింది. బహుమతి పొందుకున్న వారు 7.5 మిలియన్ల నార్వేసియన్ క్రోనల్ ఇచ్చి సత్కరిస్తారు. ఇలా కొత్త కొత్తగా ఎన్నెన్నో బిరుదులు కలవు. దేవుడు ఇచ్చే అవార్డ్ గురించి పరిశుద్ద గ్రంధంలో మనం చదవవచ్చు. ఆవేవనగా జీవకిరీటం, జీవ వృక్షం యొక్క ఫలం ఇలా అనేక అవార్డుల కలవు. ఎఫెసి సంఘం యొక్క దూతకు చెప్పినప్పుడు వారి యొద్ద ఉన్న మంచి లక్షణాలను చెప్పిన దేవుడు అదేసమయంలో వారి యొద్ద ఉన్న లోటులను కూడా ఎత్తి చూపిస్తున్నారు. ఆ లోటులను తొలగించక పోతే కలిగిన కీడులను కూడా తెలియజేస్తున్నారు. విటన్నింటిలో జయించు వారికి జీవ వృక్ష ఫలము భుజింప నిత్తును అని వాగ్దానం చేస్తున్నారు. స్ముర్ణ సంఘం పు దూతకు వ్రాసినప్పుడు వర్తమాన కాలం గురించి మాత్రమే చెప్పకుండా భవిష్యత్ కాలంలో వారికి రాబోయే శోధనలను గురించి కూడా గద్దిస్తున్నారు. ఇంకా మరణము వరకు నమ్మకంగా ఉండు వానికి జీవ కిరీటం ఇచ్చెదను అని వాగ్దానం చేశారు.
క్రీస్తులో ప్రియమైన వారలారా! లోకం మనకు ఇచ్చే బహుమతి ఏదో ఒక విషయంలో విజయం సాధించి నప్పుడు మాత్రమే కలుగుతుంది. కాని మన లోటులన్నింటిని సరిచేసి అన్ని విధాలుగా మనలను అర్హులుగా చేసి తరువాత ఎవరు నశింప చేయ జాలని నిర్ములమవ్వని నిత్యజీవమును దేవుడు మనకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. అందుకు మనం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో పూర్ణ శ్రద్ధతో ఆయనను ప్రేమించాలి అని ఆయన ఆశ పడుతున్నారు. మనలను సంపూర్ణంగా దేవుని యొద్ద సమర్పించు కొందాం నిర్మలమైన మనస్సు గల వారి యొద్దనుండి సంపూర్ణ మైన ఆశీర్వాదములను పొందుకొందాం. ఆమెన్.
- సహోదరి. ఐడా
ప్రార్ధన అంశం:-
ప్రతి రోజు వేకువజామున 5 గంటలకు యూట్యూబ్ లో లైవ్ లో వస్తున్న హీలింగ్ లో పాల్గొంటున్న వ్యక్తులు యొక్క ప్రతి బంధకముల నుండి విడుదల పొందేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250