Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.06.2022
Share:

By Village Missionary Movement

Monday, 20-Jun-2022

దిన ధ్యానము(Telugu) 20.06.2022

 

అంశం:- ఫ్రెండ్ షిప్.

 

ఈనాడు యవ్వన స్త్రీల కొరకు ప్రత్యేకమైన సందేశం.

 

"దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను" - 1సమూయేలు 18:3

 

విడిపోని ఇద్దరు స్నేహితులు కలిసి ఇంటి మేడపైన అడుకొంటున్న సందర్భంలో వారు అడుకొంటున్న రింగ్ వారి ఇంటి ముందు ఉన్న స్లాబ్ పైన పడటంతో దానిని తీసుకొని తిరిగి వెళ్తున్న వారి యొక్క ఆలోచనలో ఒక విపరీతమైన ఆలోచన కలిగింది. స్నేహితులతో ఒకరు హే దీని ఎత్తు కొంచెమేగా ఉన్నది దీని పైనుండి దూకి నా శరీరంలో ఒక్క గాయం కూడా తగల కుండా నేను లేవగలను. నువ్వు అలా చెయ్యగలవా అని చెప్పి ఇదంతా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యగలరు నువ్వు చెయ్యలేవులే అని చెప్తుండగా ఇంకొక స్నేహితురాలు నేను దూకి లేవగలను అని చెప్పడంతో ఇద్దరు కలిసి పైనుండి దూకుటకు సిద్ధపడ్డారు. ఇద్దరు కన్నులు మూసుకొని ఒకటి, రెండు, మూడు అని లెక్కించి దూకిన వెంటనే అయ్యో అనే అరుపుల శబ్దం విని అందరూ వచ్చారు. వెన్ను పూస విరిగి భరించలేని నొప్పితో ఒక స్నేహితురాలు అల్లాడిపోతుంది. కాని సాహసం చేయుటకు ప్రేరేపించిన స్నేహితురాలు మాత్రం దూక కుండా పై నుండి చూస్తుంది. శత్రువు యొక్క ఆలోచన కూడా ఇటువంటిదే. పరిశుద్ద గ్రంధంలో దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్పుటకు కారణం ఏమిటి ఏదేను తోటలో హవ్వ సర్పము యొక్క మోసపూరితమైన మాటలు విని దేవుని మాటలకు లోబడక తాను మరియు తన ద్వారా ప్రపంచం అంతా పాపములో పడుటకు కారణం అయ్యింది. 1రాజుల 13వ అధ్యాయంలో రాజు యొద్దకు యెహోవా ఆజ్ఞ ను తీసుకొని వెళ్లిన దైవజనుడు ఇంకొక ప్రవక్త ద్వారా వచ్చిన ఆబద్దపు మాటలు నమ్మి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి వాటి నుండి తొలగి సింహపు నోటిలో పడి చనిపోయాడు. ఇలా ఉండగా మనం ప్రతి రోజు దేవుని ఆజ్ఞకు లోబడి ఎంత జాగ్రత్తగా జీవించాలి? 

 

యవ్వన స్త్రీలారా 1సమూయేలు గ్రంధం 18,19 మరియు 20వ అధ్యయలలో దావీదు మరియు యోనాతానుల స్నేహం గురించి మనం చూడవచ్చు.యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించాడు. తన ప్రాణం వలె దావీదును ప్రేమించడం వలన తన కున్న అన్నింటినీ దావీదునకు ఇచ్చి తన తండ్రి చేయదలుచుకున్న కీడు నుండి దావీదును కాపాడి తన యొక్క కోరికను నెరవేర్చి మంచి స్నేహితునిగా నిరూపించబడ్డాడు. మంచి స్నేహితులు మన తప్పులు ఎత్తి చూపి మనలను మార్చాలి అనుకుంటారు. కష్టకాలంలో మనకు తోడు ఉంటారు. మనం కూడా యేసయ్య ను మంచి స్నేహితునిగా అంగీకరించి ఆయన భుజంపై ఆనుకొని ఐక్యమైన ఆత్మగా ఒక స్నేహితునిగా ఆయనతో కలిసి జీవించినట్లైతే మనకు ఉన్న బాధలను, సమస్యలను ఆయనతో పంచుకొని దుఃఖము తొలగిన వారి వలె మంచి ఆలోచనను పొందుకొని ఆయనతో మన స్నేహాన్ని బలపరుచుకొని మంచి జీవితమును జీవించగలం. 

- శ్రీమతి. వాసంతి రాజా మోహన్ గారు.

 

ప్రార్ధన అంశం:-

నంబికై అనే ఛానల్లో గ్రామీయ నేరం అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు ఆశీర్వాదములను పొందుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban holiganbet setrabet marsbahis giriş vaycasino giriş