Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.06.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 26-Jun-2022

దిన ధ్యానము(Telugu) 26.06.2022 (Kids Special)

 

అంశం:- ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

అంశం:- మారిన హృదయం.

 

"అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును" - కీర్తనలు 35:9 

 

హాలో పిల్లలు హోవ్ ఆర్ యూ? ప్రతి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా బయలుదేరి స్కూలుకు వెళ్లటం. హొమ్ వర్క్ చేయడం ఇలా చాలా చాలా బిజీగా ఉన్నారు కదా వెరీగుడ్. మీరు మంచి స్నేహితులతో కలిసి సంతోషముగా ఆడుకొని బాగా చదివి మంచిపిల్లలు అని పేరు తెచ్చుకోవాలి. యేసయ్య కూడా ఇలానే ఆశ పడుతున్నారు ఓకేనా! పిల్లలు సరే కధ విందామా! రాణి అనే అమ్మకు మణి అనే కుమారుడు ఉండేవాడు. తను చెడ్డ స్నేహితులతో కలిసి దొంగతనం చేయడం అబద్ధాలు ఆడటం. ఇటువంటి చెడ్డ పనులను ధైర్యంగా చేసేవాడు. అమ్మ చాలా బాధపడుతూ బైబిల్ ల్లో ఉన్న వాక్యాలు చెప్పినా మణి అస్సలు వినేవాడు కాదు. చేతులో డబ్బులు ఉంటే చాలు అనుకునేవాడు. తప్పు చేస్తే శిక్ష ఉంటుంది కదా అలానే మణి మరలా మరలా చేసిన తప్పు వలన చెరసాలలో బందించబడ్డాడు. అక్కడకు వెళ్లిన తరువాత కూడా మణి మారలేదు.

 

ఒక రోజు మణి అమ్మకు లేఖ రాసాడు. అమ్మ నాకు 500 రూపాయలు కావాలి పంపించండి అని. చెరసాలలో డబ్బులు ఎందుకు అని అమ్మ ఆలోచించిన సరే తన కుమారుడి పైన ఉన్న ప్రేమ వలన ఒక బైబిల్ కొని అందులో 5 చోట్ల వంద వంద చొప్పున 500 పెట్టి ఒక లేఖ ను కూడా వ్రాసి రెండింటిని పార్సెల్ చేసి పంపించారు. ఆ పార్సెల్ చెరసాలలో అధికారులు విప్పి చూసి మణి చేతికి అందించారు. మొదట అమ్మ వ్రాసిన లేఖ ను చదివాడు. కుమారుడా నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను నువ్వు కూడా ప్రతి రోజు ప్రార్థన చేసుకొని ఈ బైబిల్ చదువు అని వ్రాసారు. 500 రూపాయలు పంపించాను అని వ్రాసి ఉంటారు అని ఆశ పడిన మణికి ఇది ఒక మోసంలా ఉంది. కోపముతో బైబిల్ ను ఒక మూలన పెట్టేసాడు. 6 నెలల తరువాత మణి విడుదల పొందవలసిన రోజు వచ్చినప్పుడు అమ్మ కూడా తన కుమారుడ్ని తీసుకొని వెళ్లడానికి ఆశగా చెరసాలకు వచ్చారు. మణి బైబిల్ చదివావా నువ్వు చదివి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడి ఉంటారు కదా అలానే నువ్వు కోరుకున్న 500 రూపాయలు కూడా నీకు దొరికి ఉంటాయి అన్నారు. అమ్మవైపు మణి నిర్లక్ష్యంగా చూసాడు. కుమారుడా నువ్వు అడిగిన 500 రూపాయలు బైబిలో పెట్టాను నువ్వు చూడలేదా అని అడిగారు అమ్మ. పరిశుద్ద గ్రంధమే నీ జీవితమును మారుస్తుంది పరిశుద్ద గ్రంధంలోనే నీకు కావాల్సిన ఆశీర్వాదములు ఉంటాయి అని కుమారుడుతో కన్నీరు కారుస్తూ చెప్పారు అమ్మ. మణి హృదయంలో మార్పు కలిగించే విత్తనమును తన ముఖములో చూడగలిగారు. తన పాపములను విడిచిపెట్టి మారుమనస్సు పొందుకున్నాడు మణి. మీరు కూడా పాపమును యేసయ్య కు చెప్పి రక్షణ ఆనందమును పొందుకొనుటకు రెడీయేనా! 

 

సరే పిల్లలు మనం బైబిల్ చదివి మారుమనస్సు పొందుకొంటే మనకు సంతోషం కలుగుతుందని నేర్చుకున్నాం కదా! మరి ఇప్పుడు ఒక కంఠత వాక్యమును నేర్చుకొందామా. 

 

సిస్టర్. దేబోరాల్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al superbetin pashagaming jojobet jojobet giriş instagram unban service instagram unban service matbet matbet