Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.06.2022
Share:

By Village Missionary Movement

Sunday, 26-Jun-2022

దిన ధ్యానము(Telugu) 27.06.2022

 

ఈనాడు యవ్వనుల కొరకు ప్రత్యేకమైన సందేశం.

 

అంశం:- హొలీ ఈస్ జాలి.

 

"నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను" - లేవీయకాండము 11:45

 

ప్రియమైన అక్క చెల్లెల్లారా! ఈ చీకటి లోకంలో మనం పరిశుద్ధంగా బ్రతుకగలమా అని అనుకొంటున్నారా? కచ్చితంగా మనం పరిశుద్ధంగా బ్రతుకవచ్చు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను అని మన దేవుడైన యెహోవా సెలవిస్తున్నారు. నేను కళాశాల విద్యను పూర్తిచేసి బెంగుళూరు ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళినప్పుడు నాతో మా అమ్మ నాన్న రాలేదు. నేను ఎలాగైనా ఉండవచ్చు, నాకు చాలా సినిమా పాటలు తెలుసు, చూడకుండా పాడగలను. పాత పాటలు కొత్త పాటలు అన్ని తెలుసు మధ్య ఉన్న ఒక్క లైను చెబితే చాలు ఆ పాట చెప్పేసేదాన్ని. నా స్నేహితులందరు నన్ను చూసి ఆశ్చర్య పడేవారు. కొన్ని రోజుల్లోనే యేసయ్య నాకొరకు ఏర్పరచిన స్నేహితులను నాకు దయచేయారు. కొంచం కొంచం యేసయ్య ను గూర్చి తెలుసుకున్నాను. పూర్తిగా రక్షించబడ్డాను ఆ తరువాత సినిమా పాటలు వినడం, చూడటం తప్పు కాదు అని ఆలోచన నా లోనుండి తొలగిపోయింది. దేవున్ని స్తుతించే నోటితో నేను సినిమా పాటలు పాడకూడదు అని బైబిల్ ద్వారా పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేసారు. కాని యేసయ్య నాపై కోపపడి నన్ను శిక్షించ లేదు పరిశుద్ధాత్ముని ద్వారా ఆ ఆలోచన నాకు కలుగ జేశారు. నాకు తెలియకుండా సినిమా పాటలను పూర్తిగా మరిచిపోయాను. నేను ఏ ఎఫర్ట్ తీసుకోలేదు మనస్ఫూర్తిగా సమర్పించుకొన్నాను అంతే. సినిమా పాటలు ఎందుకు వినకూడదు, ఎందుకు చూడ కూడదు దానిలో తప్పేముంది కేవలం పాటే కదా అని మీరు అనుకొనవచ్చు అయితే చెప్తా వినండి. దేవున్ని ఆరాధిస్తున్నా ధూతలలో త్రోసివేయబడిన దూత లూసిఫర్. వాడు మ్యూజిక్ లో గొప్ప తలాంతు గలవాడు. ఈ సినిమా పాటలను విన్నప్పుడు సాతాను మన లోనికి అనవరమైన లస్ట్, లవ్, ఎమోషనల్ ఫీలింగ్స్ ని తీసుకొని వస్తాడు. అది మొదట మన మైండ్ పైన ఎఫెక్ట్ చేస్తాయి. పాపం మొదట గర్భం ధరించే స్థలం మన మైండే. మనకు తెలియకుండానే పాపమును బానిసలుగా మారిపోతాము. ఈ చిన్న పాపమే యవ్వనస్తులను పోర్నోగ్రఫీ అనే పాపము లోనికి త్రోసి వేస్తుంది. యవ్వనులైన మీకు నేను చెప్తున్న ఒక ప్రాక్టీస్ ఏమిటి అంటే లోకములో గల చిన్న చిన్న పాపములను అనుభవించుట కంటే హొలీ లైఫ్ యే జాలి లైఫ్ అనే నిజాన్ని హృదయంలో వ్రాసుకొనుట మంచిది. పరిశుద్ధంగా జీవించుటకు పరిశుద్ధుని చేతిలో మనలను మనం సమర్పించు కొందాం. ప్రభువైన దేవుడు తగిన సమయాల్లో మీ జీవితంలో సరైన కార్యములు చేస్తారు. ఆమెన్.

- శ్రీమతి. దివ్య పెర్నర్ట్ గారు.

 

ప్రార్ధనా అంశం:-

మీడియా మినిస్ట్రీలో సమర్పించుకొన్న అనుభవము గల సేవకులను దేవుడు దయ చేయులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet