Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.07.2022
Share:

By Village Missionary Movement

Thursday, 07-Jul-2022

దిన ధ్యానము(Telugu) 08.07.2022

 

అంశం:- తల వ్రాత మారిపోయింది

 

"యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను" - రూతు 2: 12

 

మిక్కిలి ప్రసిద్ధి గాంచిన ఒక సేవకుడు తన ప్రారంభ రోజుల్లో అప్పుల వలన బాధపడి తన తండ్రి చేసిన అప్పులను తీర్చుటకు దారి తెలియక యేసుక్రీస్తు ను సొంత రక్షకునిగా అంగీకరించుట వలన మోసం చెయ్యలేక ఒక కాగితం తీసుకొని అందులో అయ్యా నేను తమకు చెల్లించవలసిన డబ్బును వెంట వెంటనే తిరిగి చెల్లించ లేకపోతున్నాను అందువలన తమరు సహించి నాకు కొంచెం కాలం అవకాశం ఇవ్వండి తమ యొక్క డబ్బును త్వరలో తిరిగి చెల్లిస్తాను అని వ్రాసి అప్పుఇచ్చిన వ్యక్తికి ఇచ్చాడు. దానిని అందుకొని చదివిన అతను దానిని నలిపి విసిరేశాడు. నీ చేతి వ్రాత బాగుంది కాని నీ తల వ్రాత బాగోలేదు మొదట డబ్బులు ఇవ్వండి అని చాలా కోపంగా అన్నాడు. దానిని విని మనస్సు పగిలి దేవుని సన్నిధికి వెళ్ళి యేసయ్య నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను నా తల వ్రాతను మార్చండి అని బిగ్గరగా ఏడ్చాడు. దేవుని కృప వలన చిన్న చూపును అప్పులను దాటి ఆనాడు అల్పముగా చూడబడిన అదే చేతివ్రాత ద్వారా ఈనాడు అనేక పుస్తకాలు వ్రాసి ఒక పెద్ద సంఘంలో బోధకునిగా ఉండి దేవుని ద్వారా ఘనముగా వాడబడుతున్నాడు. 

 

పరిశుద్ధ గ్రంధంలో మోయాబు స్త్రీ అయిన రూతు జీవితం అయిన పడవ బోల్తా పడింది. భర్తను కోల్పోయిన స్థితిలో తన జాతిని, తన దేశాన్ని, తన దేవున్ని కూడా విడిచి తన అత్తను వెంబడించడం మాత్రమే కాదు తన అత్త దేవుడ్ని నమ్మింది. పొలములో చేను కోయుటకు వెళ్లినప్పుడు ఆ స్థలంలో బోయాజును చూపించి అతని కన్నులలో రూతు దయ పొందుకొనేల దేవుడు సహాయం చేసారు. సమస్తమును కోల్పోయిన సమయంలో బోయాజును వెతుక్కుంటు వచ్చిన రూతుకు అతని ద్వారా ఓదార్పు మరియు మంచి సలహా, గుర్తింపు , ఆశీర్వాదం మరియు భార్య అయ్యే అవకాశం దొరికింది. చేను కోయుటకు వచ్చిన ఆమె ఆ పొలానికే సొంతం అయ్యింది. ఈ లోక ప్రకారమైన బోయాజు యొద్దకు వచ్చిన రూతు యొక్క తల వ్రాత ఇంతగా మారింది అంటే మనలను వెతుక్కుంటూ వచ్చిన పరమ బోయాజు అయిన యేసు యొద్దకు వెళ్లినప్పుడు ఆయన మాటల ద్వారా మనలను ఓదార్చి మనలను ఆయన పిల్లలుగా మార్చి నడువవలసిన మార్గం చూపించి సకల విధములైన ఆశీర్వాదములతో మనలను నింపి ఆయనతో కూడా ఉండుటకు, ఆయనతో పరిపాలించుటకు తగిన అధికారం ఇస్తున్నారు. ఇందుకొరకు మనం ఏం చెయ్యాలి? దూరంగా ఉన్న మనం ఆయనకు సమీపమునకు వచ్చి దేవుని మాటకు లోబడిన వారై ఆయన పాదమే బంగారం ఆనుకోని నమ్మినట్లయితే అధిపతి అయిన క్రీస్తు వలన మన తల వ్రాత మార్చుకొని తల ఎత్తుకొని నడిచే వారిలా మారాతం.

- శ్రీమతి. వాసంతి రాజ్ కుమార్.

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో ఒక గదిలో ఇద్దరు మిషనరీలు నివాసం ఉండి శిక్షణ పొందుకొనుటకు కావలసిన 60 గదులు కట్టబడేటట్లు ప్రార్దిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort