Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.07.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 10-Jul-2022

దిన ధ్యానము(Telugu) 10.07.2022 (Kids Special)

 

అంశం:- లోబడని డక్లింగ్(బాతు పిల్ల)

 

"నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు" - కీర్తనలు 32: 5

 

విలేజ్ మిషనరీ మూవ్మెంట్ తరుపున ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

హాయ్ పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు. బాగున్నారా? సరే ఎప్పటి లాగానే ఈరోజు ఒక కథ విందామా? ఒక అందమైన బాతు తన మూడు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ వచ్చిందంట. సాయంత్రం సమయంలో నీటిలో ఆడుకోవడానికి తినడానికి జాలిగా ఎంజాయ్ చెయ్యడానికి అమ్మ బాతు తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకొని వెళ్తుండేదంట. పిల్లలు మీరు కూడా ఆడుకోవడానికి పార్క్ కు వెళ్తారు కదూ, అమ్మ నాన్నతో కలిసి షాప్ కి కూడా వెళ్తారు కదా అలా వెళ్ళినప్పుడు వారి మాటలు వింటూ మంచి పిల్లల వలె ఉండాలి ఓకేనా. ఆ బాతు పిల్లలలో ఒక పిల్ల చాలా అల్లరి చేస్తుదంట. సరే రండి టైమ్ అయిపోతుంది ఇంటికి వెళ్లిపోదాం అని అమ్మ చెప్పిన ఆ అల్లరి చేసే బాతు పిల్ల మాత్రం వస్తానమ్మ కాసేపు ఆగమ్మ అని ఆడుకొంటూ ఉండిపోతుందంట. నువ్వు ఒంటరిగా ఉంటే కుక్కలు, నక్కలు వచ్చి నిన్ను కరిచేస్తాయి నాతో కలిసి ఉంటేనే నీకు సంరక్షణ అని అమ్మ బాతు చెప్పిన అన్నింటినీ కూడా అస్సలు వినేది కాదంట. తామర ఆకుల వెనుక దాగి ఉండిపోయింది అంట ఆ అల్లరి బాతు పిల్ల. ఒక రోజు చీకటి కావడంతో అమ్మ బాతు వెంట రెండు పిల్లలు వెళ్లిపోతున్నాయి అంట కాని ఈ అల్లరి బాతు పిల్ల మాత్రం నేను కాసేపు ఆగి వెళ్తాను అలాగే త్వరగా వెళ్లి అమ్మతో కలిసిపోతానులే అనుకొంటూ జాలిగా ఈతకొడుతూ చిన్న చిన్న చేపలను తింటూ ఉండిపోయిందంట. సడన్ గా నక్క అరుపులు విని చాలా బయపడిందంట. అయ్యో అమ్మ చెప్పిన మాటలు వినకుండా ఆడుకొంటూ ఉండిపోయానే అయ్యో ఈరోజు నేను చచ్చినట్లే అనుకొనిన వెంటనే ఒక ఆలోచన వచ్చిందంట. మన దేవునికి ప్రార్థన చేద్దాం అనుకొని నన్ను కాపాడండి యేసయ్య ఇకనుండి నేను విధేయతకలిగి లోబడి మంచి పిల్లగా ఉంటాను కాబట్టి నాకు సహాయం చెయ్యవా అని ప్రేయర్ చేసిందంట. ఆ తరువాత అందంగా విరబూసిన తామర పువ్వులో వెళ్లి కూర్చోవడంతో ఆ పువ్వు వెంటనే ముడుచుకోంది అంట. ఉదయాన్నే సూర్య కిరణాలు ఆ తామర పువ్వు పైన పడడంతో ఆది చక్కగా విరబూసిందంట. కళ్ళు తెరిచి చూసిన బాతు పిల్ల తాను భద్రంగా ఉండటాన్ని గమనించి జీసస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇంటికి వెళ్ళిపోయి అప్పటి నుండి అమ్మ మాటలు వింటూ లోబడుతూ మంచి పిల్లగా మారిందంట. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి లోబడక పోవడం పాపమే కదా? అవునా ఇదంతా పాపమా అనుకోకూడదు. పాపము భయాన్ని కలుగజేస్తుంది. భయం సంతోషాన్ని కోల్పోయేలా చేస్తుంది. యేసయ్య రక్తం నీ పాపాన్ని డిలీట్ చేసేస్తుంది. నువ్వు జీసస్ తో చాట్ చెయ్యడానికి రేడీయేనా? సరే పిల్లలు లోబడకపోవడం కూడా ఒక పాపం అని ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకొందమా? 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban holiganbet setrabet marsbahis giriş vaycasino giriş