Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.07.2022
Share:

By Village Missionary Movement

Monday, 11-Jul-2022

దిన ధ్యానము(Telugu) 11.07.2022

 

అంశం:- యవ్వనులారా వినండి.

 

"ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము" - సామెతలు 20:18

 

ఒకరోజు ఒక ముసలాయన పాత భవనంలో ఉన్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడ్ని చూడటానికి వచ్చారు. ఊహించని విధముగా ఆరోజు లిఫ్ట్ పనిచేయక పోవడంతో తన కుమారుడ్ని చూడాలని ఆశతో చేతిలో బరువును పట్టుకొని కష్టపడి ఆ భవనం యొక్క మెట్లు ఎక్కడం ప్రారంభించారు. మూడవ అంతస్తుకు ఎక్కేసరికి అలసటతో నిలబడిపోయారు. అక్కడకు వచ్చిన ఒక యవ్వనుడు ఆ ముసలయానను చూసి అయ్యో చేతిలో ఉన్న బరువుతో ఈయన ఎలా మెట్లు దిగగలడు అని అనుకొను అతని చేతిలో సంచిని తీసుకొని త్వరగా క్రిందకు వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన ఎంత పిలిచిన నిలబడకుండా క్రిందకు వెళ్లి సంచిని అక్కడ పెట్టేసి నేను చేయవలసిన సహాయం ఆ పెద్దాయనకు చేసేసాను అని తనను తానే మెచ్చుకొంటు వెళ్ళిపోయాడు. అలసటతో క్రిందకు వచ్చిన ఆ ముసలాయన మరల ఆ సంచిని తీసుకొని పైకి ఎక్కడం ప్రారంభించాడు. బాగా అలసిపోయి రెండవ అంతస్తుకు వచ్చి నిలబడిపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక యవ్వనరాలు అయ్యా నేను మీకు చెయ్యగలిగిన సహాయం చేస్తాను అని చెప్పి సంచిని తీసుకొని క్రిందకు వెళ్ళిపోయింది. అమెకూడా అర్థం చేసుకొనకుండా ఆ సంచిని క్రింద పెట్టి వెళ్ళిపోయింది. సరైన ఆలోచన లేని వారి క్రియలను చూసి ఏం చెయ్యాలో తెలియక క్రిందకు వెళ్లలేక, పైకి వెళ్లలేక అక్కడే ఆగిపోయారు ఆ పెద్దాయన. దీనికి కారణం ఏమిటి పనిని సరిగ్గా అర్థం చేసుకొనక పోవడమే కదా. 

 

1రాజుల గ్రంధం 12వ అధ్యాయంలో దావీదు మరియు సొలొమోను పరిపాలించినప్పుడు ఒకటిగా నున్న ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోవడం గూర్చి వ్రాయబడి ఉన్నది. కారణం ఏమిటి పెద్దలు తమతో చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి తనతో కూడా పెరిగిన యవ్వనులను ఆలోచన అడిగి సరైన అనుభవం లేని వారి మాటలను విని వారి చెప్పినట్లే నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను సరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించెదను అని జనులకు కఠినముగా ఆజ్ఞాపించెను యరొబాము. ఇందువలన ఒక భాగం యరొబామును తమకు రాజుగా ఏర్పరచుకోవడం వలన ఇశ్రాయేలు దేశం యూదా మరియు ఇశ్రాయేలు అనే రెండు రాజ్యాలుగా విడిపోయింది. 

 

ప్రియమైన యవ్వనస్తులారా! మీ జీవితంలో మీరు దాటుకుని వెళ్తున్న పరిస్థితుల్లో సమస్యల్లో ఎవరి సలహాలను విని నడుచుకొంటున్నారు? అనుభవం లేని, సరైన ఆలోచన లేని వారి యొద్ద సలహా అడిగితే వారు తమ మనస్సుకు సరైనది అనుకోని దానిని చెప్పి మిమ్మును చిక్కుల్లో పడేస్తారు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. దావీదు నాకు ఆలోచన కర్తయైన యెహోవాను స్తుతించెదను అని చెప్తున్నాడు. మీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును మీకు బోధించెదను, నీ మీద దృష్టి యుంచి నీకు ఆలోచన చెప్పెదను అని సెలవిచ్చిన యెహోవా యొద్ద ఆలోచన అడగాలి. తరువాత నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్న ఆత్మీయుల యొద్దనుండి ఆలోచన అడిగి దాని ప్రకారముగా నడుచుకొనుటకు ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినప్పుడు జీవితం స్థిరపడి సంఘమునకు, సమాజమునకు నీవు ఆశీర్వాదకరముగ కనబడతావు. ఆమెన్.

- శ్రీమతి. వాసంతి రాజ్ మోహన్ గారు

 

ప్రార్థన అంశం:-

ఒక మిషనరీ గది కట్టడానికి 2లక్షల రూపాయలు అవసరమై ఉన్నది కాబట్టి ఈ అవసరత సంధింపబడు లాగున మరియు మిషనరీలను సహకరించే భాగస్వాములు లేచేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino