Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.07.2022
Share:

By Village Missionary Movement

Monday, 11-Jul-2022

దిన ధ్యానము(Telugu) 12.07.2022

 

అంశం:- ఇప్పటి కాలపు శ్రమ.

 

"క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను" - ఫిలిప్పీయులకు 1:30

 

సెర్గి అనే నాయకుడు తన దేశమును గూర్చిన సంబందంలో తీవ్రమైన కఠినత్వం కలవాడు.కమ్యూనిస్టు పాలనలో రష్యా యొక్క సిద్దాంతంలో మిక్కిలి ఆకట్టుకున్న వాడుగా ఉన్నాడు. రష్యా యొక్క రహస్య మేధస్సు గల పోలీసులలో నిర్దిష్ట స్థానములో నాయకునిగా ఉండి క్రైస్తవులను శిక్షించుచు, కొడుతూ చెరసాలలో బందించడమే సెర్గి యొక్క ప్రధాన పని వలె ఉండేది. ఒక సారి రహస్యముగా ఒక స్థలములో ప్రజలు ఒకటిగా కూడి ప్రార్థిస్తున్నారు అనే సంగతి ఎరిగి తన గుంపుతో అక్కడికి వెళ్ళాడు సెర్గి. విశ్వాసులు ఊహించని సమయంలో అతను లోనికి వెళ్లి కొట్టడం మొదలు పెట్టాడు. అందులో నటస్సా అనే యవ్వనురాలిని కొట్టి చాలా హింసించాడు. ఇప్పుడు సెర్గికి హృదయంలో అంతులేని ఆనందం. ఇకపై వీరు ఇంకా ఎక్కడ కూడి ప్రార్ధించారు అని అనుకున్నాడు. మరుసటి వారం మరల వేరొక స్థలంలో క్రైస్తవులు చిన్న కూటముగా కూడి అరాధిస్తున్నారు అని సెర్గి విని అక్కడికి వెళ్లి ప్రార్ధించే వారిని మాటిమాటికి ఆటంకం చేసేవాడు. ఇప్పుడు సెర్గికి చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకు అంటే మొదటి వారం బాగా గాయపరచ బడిన నటస్సా అనే యవ్వనురాలు గాయాలతో అక్కడికి వచ్చింది. మిక్కిలి కోపంతో అక్కడికి వెళ్లిన అతను తన చేతులతో ఆమె మొకము పైన గుద్దాడు. తరువాత ఒకరోజు మరల మరొక కూటములో సెర్గి నటస్సాను చూసాడు. నటస్సా యొక్క నిజాయితీ గల ప్రవర్తన మరియు ప్రార్థన సెర్గి యొక్క హృదయంలో అనేక ప్రశ్నలు కలుగజేశాయి. కొన్ని వరాలలోనే సెర్గి కూడా దేవుని ప్రేమ చేత పట్టబడి దేవుని సన్నిధికి తీసుకొని రాబడ్డాడు. ఒక్క యవ్వన స్త్రీ యొక్క కదలింపబడని విశ్వాసం ఒక మొండి తనం కలిగిన వ్యక్తిని క్రీస్తు లోనికి నడిపించింది. కొన్ని సమయాల్లో మనకు వచ్చే శ్రమలు దేవుని నామమునకు మహిమను తీసుకొని వస్తాయి అని మనం ఎరిగి యున్నాము. రిచర్డ్ ఉమ్రాడ్ గారు చెరసాలలో అనుభవములు తమకు వేదన కలుగ జేయలేదు బదులుగా అనేక మంది ఖైదీలకు మారుమనస్సు దయచేయుటకు ప్రభువే మమ్ములను చెరసాలకు తీసుకొని వెళ్లారు అని వ్రాసారు. ఈ వార్తను వింటున్న మీలో అనేకులు శ్రమలు మధ్యలో వెళ్తూ ఉండవచ్చు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము కాబట్టి ఇప్పుడు ఉన్న శ్రమలలో కృంగిపోవద్దు, వెనుదిరగ వద్దు. మీకు కలిగే శ్రమలు మీకు మహిమను మీ చుట్టూ వున్న వారి మధ్యలో మార్పులు తీసుకొని వస్తాయి అనేది నిశ్చయం. మన యెడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు అనే వాక్యం ఎంత సత్యమైనది.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

చైన్ ప్రేయర్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ దేవుడు ప్రార్థన శక్తితో మరియు ఆత్మల పట్ల భారంతో నింపు లాగున ప్రార్దిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet betgit radissonbet