Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.07.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 27-Jul-2022

దిన ధ్యానము(Telugu) 28.07.2022

 

అంశం:- అద్భుతమైన దేవుడు.

 

"ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు" - కీర్తనలు 50:15

 

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అది. ఒక అమెరికా యుద్ధ వీరుడు తన సైన్యం నుండి తప్పిపోయాడు. అక్కడ యుద్ధం భయంకరంగా జరుగుతున్నది. తన సైన్య వీరులను చూడలేనంతగా అంత గుహలతో నిండి ఉన్నది. అతడు తన ప్రాణమును కాపాడుకోనుటకు ఒంటరిగా అడవిలోనికి పారిపోయాడు. అతని అడుగు శబ్దం విని శత్రు దేశ సైన్యం కూడా అతనిని వెంటాడుతూ వస్తున్నారు. అతడు తన ప్రాణమును కాపాడు కొనుటకు ఎక్కడైనా స్థలం ఉన్నదా అని చుట్టూ తిరిగి చూడడం మొదలుపెట్టాడు. అక్కడ చిన్న చిన్న గుహలు ఉండటం చూసాడు. కాని అవి అతనిని రక్షించే అంతగా లేవు అయినప్పటికీ వేరే దారి లేక అందులో ఒక గుహలో దాక్కున్నాడు. ఆ గుహలో నిశ్శబ్దంగా ప్రభువా నా చుట్టూ శత్రువులు ఉన్నారు నీకిష్టామైతే నన్ను విడిపించు అని ప్రార్ధించాడు. అయితే ఆ గుహలోనే నేను కూడా ఉన్నాను. నేను ఎవరు అని ఆలోచిస్తున్నారా చెప్తాను ఉండండి అకస్మాత్తుగా ఆ గుహ ద్వారామును మూసివేయుము అని అజ్ఞాపించారు. అయితే అజ్ఞాపించిన వాడు నన్ను సృజించిన వాడు కదా వెంటనే నేను త్వర త్వరగా ప్రభువు నాకు చెప్పిన విధముగా వలను అల్లుతూ ఆ గుహ ద్వారామును మూసివేసేసాను. అక్కడ ఉన్న నన్ను ఆ యుద్ధ వీరుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. పాదముల శబ్దం వినిపించింది శత్రు సైన్య వీరులు ప్రతి గుహలోనికి వెళ్లి చూస్తూ ఉన్నారు. ఈ సైన్య వీరుడు ఉన్న గుహ దగ్గరకు వచ్చినప్పుడు ఇది వలతో అల్లబడి ఉన్నది కాబట్టి ఇందులో ఏ ఒక్కరు ఉండే అవకాశమే లేదు అనుకొని లోనకు చూడకుండా వెళ్లిపోయారు. ఆ సైన్య వీరుడు చాలా సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలిపి తన దారిలో వెళ్ళిపోయాడు. నేను ఎవరు అని మీరు ఇంకా అనుకొనవచ్చు ఆ వల అల్లినది చిన్న సాలిపురుగునైన నేనె. 

 

ప్రియమైన మనుష్యులారా! నేను ఒకటే ఆలోచించాను మనుష్యులైన దేవుడు మిమ్మును ఎంతగా ప్రేమిస్తున్నాడో మత్తాయి సువార్త 6:26 లో యేసుక్రీస్తు చెబుతున్నారు. నాకంటే మీరు అతి శ్రేష్ఠులు. నాకు సహాయం చేయుటకు ఎవరు లేరు నన్ను ప్రేమించే వారు ఎవరూ లేరు. అని అనుకున్నట్లయితే మీకు సహాయం చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించండి. 

- బ్రదర్. ఆల్విన్ జాకబ్

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో జరుగుతున్న ఉజ్జీవం ఆశించే వారి కూటముల కొరకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet