Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.08.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 06-Aug-2022

దిన ధ్యానము(Telugu) 07.08.2022 (Kids Special)

 

అంశం: యేసయ్య యొద్ద టిప్స్ అడుగు.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"భయమునొంది పాపము చేయకుడి" - కీర్తనలు 4:4

 

హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? తరుచుగా చిల్డ్రన్ స్పెషల్ ద్వారా మిమ్మల్ని కలుసుకొనుట ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు సంతోషంగా ఉన్నారా? ఒకే వెరీ గుడ్.

 

నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నా చిన్నప్పుడు అష్టా చమ్మ, దాగుడు మూతలు, గోలి ఇలా చాలా ఆటలు ఆడేవాళ్ళం. పిల్లులు ఈ ఆటలు మీకు తెలియదు కదా? మీకు వీడియో గేమ్స్, టీ. వి, ల్యాప్ టాప్, కంప్యూటర్, సెల్ ఫోన్ వీటితోనే అడుకొంటారు కదా! ఎక్కువ సేపు అడుకొని మీ కళ్ళను పాడు చేసుకో కూడదు సరేనా! పరిగెడుతూ, గెంతుతూ అడుకొంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. సరే మీరు చెప్పాల్సింది చెప్పండి అంటారా ఓకే చెప్తా. 

 

మేము 7 మంది కలిసి అడుకొంటూఉన్నాం. దాగుడు మూతలు ఆటలు చాలా జాలిగా అడుకొంటున్నాం. హఠాత్తుగా సెల్వి అనే పాప గ్లోరి మొఖము మీద గట్టిగా గిల్లేసింది. ఏంటి నేను చూస్తున్నాను మాటి మాటికి నన్నే అవుట్ చేస్తుంది కాబట్టి నాకు కోపం వచ్చింది అని చెప్పి సెల్వి ఇంటికి వెళ్ళిపోయింది. తన మొఖం పైన గాయంతో ఏడుస్తూ గ్లోరి కూడా వెళ్ళిపోయింది. మేము కూడా సెక్యూరిటీ గార్డ్ లా వారి వెనుక వెళ్లిపోయాం. గ్లోరి వాళ్ళ అమ్మకు వచ్చింది చూడండి కోపం నేరుగా సెల్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో గొడవ పడడం ప్రారంభిచింది. చాలా పెద్ద గొడవ జరిగింది. మేము దూరం నుండి చూస్తూవున్నాం. మాకు చాలా భయం వేసి మేము పరిగెత్తుకొని ఇంటికి వెళ్లిపోయాం. చిన్న కోపం ఎంతటి పెద్ద హాని చేసింది. సెల్వి, గ్లోరి ఇద్దరూ మరుసటి రోజే కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. కాని వారి కుటుంబాలు మాత్రం చాలా రోజులు పగతోనే ఉన్నారు. కోపం ప్రతి ఒక్కరికి వచ్చేదే కాని శాంతి కోల్పోకూడదు. అప్పుడు కోపం వలన వచ్చే నష్టాలు ఎదుర్కొనకుండా కోపం తగ్గి సంతోషంగా జీవించుటకు ప్రభువు సహాయం చేస్తారు. 

 

ఏంటి పిల్లలు మీకు కూడా కోపం వస్తుందా? చూడటానికి చాలా మంచి పిల్లలు వలె వుంటారు. కోపపడి పాపము చెయ్యకూడదు. అంటే కోపంలో కొట్టటడం వస్తువులను విసిరి పారేయడం వంటివి చెయ్యకూడదు. అన్నిటికంటే కోపాన్ని తగ్గించుకొని బ్రతుకుటకు యేసయ్య యొద్ద టిప్స్ ఉన్నాయి. ప్రతి రోజు ఆయన యొద్ద అడిగి పొందుకోవడం మరచిపోవద్దు. ఓకేనా! సరే పిల్లలు ఇప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చుకొందామా? 

 

శ్రీమతి. మణి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet