Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.08.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 07-Aug-2022

దిన ధ్యానము(Telugu) 08.08.2022 (Youth Special)

 

అంశం: ఏ శబ్దం వినాలి.

 

"యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు" - కీర్తనలు 127: 4

 

ఈ యవ్వన కాలమందు సాతాను మన జీవితంలో ఈ లోకపు శబ్దమును అధికముగా వినేలా మన చెవులను దాని ప్రక్కకు తిప్పేస్తుంది. ఈ లోకపు శబ్దమును వింటే అది మనకు ఏం చేస్తుంది.

 

1. లైఫ్ లొ ఫోకస్ లేకుండా కొనసాగుతాము 

 

2. మన మైండ్ లో అశుద్ద మైన ఆలోచనలను కలుగజేస్తుంది.

 

3. మనలను ప్రభువు లోనికి రానివ్వకుండా మనకు ఎవ్వరూ లేరు అనుకొనేలా చేస్తుంది. 

 

4. అబద్ధపు ప్రేమలో మనలను చిక్కుకొనేలా మనలను చేస్తుంది. 

 

5. మాయ కరమైన ఈ లోకపు కార్యాలే మనకు నిజమైనవి అని మనలను నమ్మిస్తుంది. 

 

6. ప్రభువు దృష్టికి మనం ఎవరము అనే విషయాన్ని ఆలోచింపనియ్యదు. 

 

సాతాను యవ్వన కాలములో లోకపు శబ్దము మనలను అధికముగా స్వాధీన పరుచుకొనే విధంగా మోసపూరితముగా చాలా రకములైన రుగ్మతల మూలంగా మిమ్ములను మోసం చేస్తాడు. ఈ లోక శబ్దమునకు మీరు పాస్ బటన్ నొక్కినట్లయితే మన దేవుని శబ్దమును మనము వినగలము. 1రాజుల గ్రంధం 19వ అధ్యాయంలో దేవుడు ఏలియాతో మాట్లాడినప్పుడు మొదట వచ్చిన బలమైన పెనుగాలిలో దేవుడు ప్రత్యక్షం కాలేదు గాని మిక్కిలి నిమ్మలంగా మాట్లాడారు అని మనం చదువుతున్నాం. అదేవిధంగా మనతో కూడా ప్రభువైన యేసు నిమ్మల మైన శబ్దంతో మాట్లాడుతున్నారు. (So tune your ears towards Gods word). మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో వారి శబ్దము సుపరిచితముగా ఉంటుంది. అదే విధంగా మీరు దేవునితో అధిక సమయం గడపడం నేర్చుకొంటే ఆయన యొక్క నిమ్మలమైన శబ్దమును మీరు వినవచ్చు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని ప్రభువు చెప్పియున్నారు. మీ ద్వారా ఈ దేశమును కదిలించాలి అని దేవుడు ఆశ పడుతున్నాడు. ఈ లోకంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు దేవుడైన యెహోవా మిమ్మును వాడుకోవాలి అని ఆశ పడుతున్నారు కాబట్టి అవకాశం పొగోట్టుకోవద్దు. శత్రువు చెప్పే లోకపు శబ్దము వినవద్దు. దేవుడు మిమ్మును హెచ్చించి మిమ్మును అనేకులకు ఆశీర్వాద కరముగా మార్చుటకు సిద్ధంగా ఉన్నారు. అందువలన ప్రియమైన యవ్వన చెల్లెల్లారా మీరు మీ చెవులను దేవుని మాటలను వినుటకు అలవాటు చేస్తే మీరు ఈ భూమిని పరిపాలించవచ్చు. ఆమెన్.

- శ్రీమతి. దివ్య పెర్నడ్.

 

ప్రార్థన అంశం:-

మన సేవ స్థలాల్లో మనం దర్శిస్తున్న గ్రామాల్లో విస్తారమైన ఆత్మలను దేవుడు ఇచ్చులాగున ప్రార్దిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino