Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.08.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 16-Aug-2022

దిన ధ్యానము(Telugu) 16.08.2022

 

అంశం:- ఒక్క పూట భోజనం.

 

"నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము" - సామెతలు 23:2

 

ఒక మహిళ, సేవకుడైన బిల్లి గ్రాహంతో ఫోన్ లో ఇలా మాట్లాడింది. రాత్రింబవళ్ళు అధికముగా బాధించే భయంకరమైన కార్యం నన్ను బానిసగా చేసుకుంది. లెక్కలేనన్ని ఆటంకాల వలన నేను ఎంత కష్టపడినను దాని నుండి విజయం పొందుకోలేదు. ఈ విధముగా నన్ను హింసించే కార్యం తిండిబోతు తనమే. దీని నుండి నేను బయట పడుటకు ఏదైనా దారి ఉందా అని అడిగింది. అందుకు బిల్లీగ్రహం దీనికి ఒకే ఒక మార్గం అది రక్షకుడైన యేసు క్రీస్తే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పిన యేసయ్య నీకు విడుదల కలుగజేయగలరు అన్నారు. ఈ తిండిబోతును గూర్చి బిల్లీగ్రహం చెప్పిన కొన్ని విషయాలు చూద్దామా. 

 

ప్రపంచంలో లెక్కలేనంత మంది ప్రజలు ఆకలితో చనిపోతూ ఉన్నప్పుడు మనం మాత్రం ఆహారమును సరిగా ఉపయోగించకుండా మితిమీరి తిని మన శరీరమును, ఎదుటి వారిని హింసించడం న్యాయమా? ఇతరులు ఆకలితో ఆలమటించడం గూర్చి కొంచం కూడా పట్టించుకోకుండా సుఖ బోగములతో జీవించే వారిని గూర్చి పరిశుద్ధ గ్రంధం ఏం చెబుతోంది. ఈ లోకపు జీవనోపాధి కలవాడై యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని యెడల ఎంత మాత్రం కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అని 1 యోహాను 3:17లో వ్రాయబడి ఉన్నది. ఈరోజుల్లో ఆకలితో చనిపోయే వారి కంటే అధికముగా తిని చనిపోయే వారు ఎక్కువ మంది ఉన్నారు. నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న చాలా భయంకరమైన వ్యాధులకు తిండిబోతు తనమే కారణం. తిండిబోతు తనం మనిషిని చంపుతోంది. తిండిబోతును గూర్చి పరిశుద్ధ గ్రంధం ఇలా చెబుతోంది. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు అని. మనలో అనేకులు ఒక పాపం వలె చూడటం లేదు క్రైస్తవుల మధ్యలోనే ఉండే తిండి బోతులను అడ్డుకోనుటకు దేశంలో చట్టాలు లేకపోయినా దానిని ఎదిరించి గద్దించుటకు సత్య గ్రంధంలో వాక్యం ఉంది. 

 

ప్రియమైన వారలారా! దేవుడు మనకు ఇస్తున్న ఆహారం నిమిత్తముగా ఆయనకు స్తోత్రం చెల్లించి ఆశతో అవసరమైనంత మాత్రమే ఆహారమును వినియోగించి బలం తెచ్చుకొని ఆరోగ్యంగా జీవిద్దాం. ఆహారం భుజించినప్పుడల్లా మన చుట్టూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను గుర్తు చేసు కొందాం. సమయం దొరికినప్పుడు వారికి సహాయం చేద్దాం. మనం అధికముగా తినే ఆహారంలో కొంచం ఇతరులకు పంచి పెట్టినట్లయితే అదే మన మనస్సుకు సంతోషమును, మనం ఏదో మంచి కార్యం చేస్తున్నాం అనే ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచన రాబోయే రోజుల్లో సహాయం చేసే చేతులుగా మారుతుంది. ఆకలితో ఉన్న మన సమాజం యొక్క ఆకలిని తీరుద్దాం. హల్లెలుయా!

- బ్రదర్. టి.శామ్యూల్ గారు

 

ప్రార్థన అంశం:- 

రాగ్ ల్యాండ్ మిషనరీ శిక్షణ సభ ప్రతిష్ట ఆరాధనను దేవుడు ఆశీర్వదించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet