Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.08.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 22-Aug-2022

దిన ధ్యానము(Telugu) 22.08.2022 (Youth Special)

 

యవ్వనుల కొరకు ప్రత్యేకమైన సందేశం

 

అంశం:- వద్దు.

 

"ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు" - 1యోహాను 2:15

 

కొన్ని సంవత్సరాల క్రితం హోమ్ మ్యాగజైన్ ఒక కథనాన్ని వివరిస్తూ ఒక వార్తను ప్రచురించింది. అదేమనగా ఒక తల్లి వంట గదిలో వంటచేస్తున్నారు. కూరగాయలు శుభ్రపరిచి కొసి, పండ్లను ఒలిచి ఒక పాత్రలో వేసి ఆహారం తయారు చేస్తున్నారు. కూరగాయలలో పాడైన ముక్కలను, మరియు పండ్ల తొక్కలను చెత్త కుండీలో వేయాలని ఒక వైపు ఉంచారు. అప్పుడు ఆమె యొక్క కుమార్తె వచ్చి అమ్మ నేను ప్రపంచ వినోద కేంద్రంలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తాను అని అనుమతి అడిగింది. ఆ వినోద కేంద్రం అంత మంచిది కాదని అనేకులు మాట్లాడే ఒక స్థలం. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఆ స్థలానికి వెళ్ళొద్దు అని చెప్పారు. అందుకు ఆమె అమ్మ నేను ఇష్టపడి వెళ్లడం లేదు నేను వెళ్ళకపోతే నా స్నేహితులు ఆట పట్టిస్తారు. అందుకే నేను వెళ్ళాలి అని చెప్పింది. వెంటనే ఆ తల్లి చెత్తకుండిలో వేయాలి అని ఉంచిన ఆ పాడైన పదార్దాలను ఒక చేతి నిండ తీసుకొని వచ్చి తాను వండుతున్న ఆహారంలో పడేసారు. అమ్మ మర్చిపోయి అలా చేసి ఉంటారు అనుకొని అమ్మ చెత్తకుండిలో వేయవలసిన చెత్తను ఆహారంలో వేశారు అని చెప్పింది. అందుకు అమ్మ నేను తెలిసే చేసాను అయిన నీ హృదయం చెత్తను అంగీకరించే విధముగా ఉన్నప్పుడు నీ కడుపు కొంచం చెత్తను తినడంలో తప్పులేదు కదా అని అన్నారు అమ్మ. ఆ కుమార్తె అర్థం చేసుకొని సరే ఇప్పుడే మా స్నేహితులకు కాల్ చేసి నేను రావడం లేదు అని చెప్తాను అని అన్నది. 

 

దీనిని చదువుతున్న యవ్వన పిల్లలారా మీరు పాఠశాలలో చదువుతూ, లేదా పై చదువులకు వెళ్ళినప్పుడు ఇతర స్నేహితులతో అన్ని విషయాల్లో సర్దుకు పోలేము. కొన్ని కొన్ని పాపపు క్రియలకు నో చెప్పాలి. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి. తప్పుడు అలవాట్లకు స్నేహితులు ప్రేరేపించినప్పుడు నో అని చెప్పండి. మీరు లోకం నుండి వేరు అవ్వకపోతే లోకం మిమ్మును దేవుని నుండి వేరు చేసేస్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దానియేలు వలె యోసేపు వలె సజీవ చేప వలె ఎదురు ఈదుతు తప్పించుకొనండి.

- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్.

 

ప్రార్థన అంశం:-

చైన్ ప్రేయర్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మతో, ఆత్మల భారంతో దేవుడు నింపులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş