Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.09.2022
Share:

By Village Missionary Movement

Friday, 09-Sep-2022

దిన ధ్యానము(Telugu) 09.09.2022

 

అంశం:- మంచి సైనికుడు.

 

"క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము" – 2 తిమోతికి 2:3

 

యున్ అనే దేవుని సేవకుడు చైనా ప్రజలకు యేసయ్య గురించి చెప్పడం వలన అక్కడ ఉన్న చెరసాలలో బందింప బడ్డాడు. అక్కడ అనేక శ్రమలు, కష్టాలు అనుభవించాడు. చాలా సమయాల్లో యున్ యొక్క నోటినుండి రక్తం వచ్చేలా అక్కడ ఉన్న కాపలా దారులు కొట్టేవారు. ఆ గాయముల కారణంగా ముఖము అంతా పగిలి గుర్తు పట్టలేనంత వికృతంగా మారేది. ఆ చెరసాలలో చలి అధికంగా ఉండటం వలన అతని చేతుల్లో రక్తం గడ్డ కట్టేది. చాలా సమయాల్లో ఆ చేతులు పగిలి రక్తం కారుతూనే ఉండేది. ఒక రోజు యున్ ఆ బాధను భరించలేక దేవుని వైపు చూస్తూ ఏడ్చాడు. అప్పుడు అతనికి ఒక వాక్యం గుర్తుకు వచ్చింది. సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు అని కీర్తన 46:11లో వ్రాయబడిన వాక్యం ఆయనను ప్రోత్సహించి బలపరచడం వలన ఆయన శ్రమలను సహించ గలిగాడు. ఇతని మూలముగా అనేకులు రక్షించ బడ్డారు. 

 

ఇదే విధంగా పరిశుద్ధ గ్రంధంలో స్టెఫాను అనే యవ్వనస్తుని గురించి మనం చదువుతున్నాం. సంఘంలో ఆహారం పంచి పెట్టి నప్పుడు కూడా అతడు దేవుని కొరకు పరిచర్య చేయుటకు వచ్చాడు. అతని ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్బుతములను, ఆశ్చర్య కార్యములను చేశారు. స్టెఫాను యేసుక్రీస్తును గూర్చి చెప్పి నప్పుడు విన్నవారి లో కొన్ని పట్టణములకు చెందిన వారు అతనికి విరోధముగా వాదించుటకు మనుష్యులను ఏర్పాటు చేశారు. వారు అతనిని పట్టణపు వెలుపలకు వెల్లగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. కాని స్టెఫాను మాత్రం తనను చంపుటకు రాళ్లు రువ్విన వారి కొరకు మోకాళ్ళుని ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకుము అని ప్రార్ధించాడు. సౌలు అనే యవ్వనుడు కూడా స్టీఫెనును చంపుటకు సమ్మతించాడు. దేవుడు ఈ సౌలును పౌలు వలె మార్చి ఆసియా ఖండం అంతా సేవచేయుటకు ప్రభువు అతనిని వాడుకున్నారు. 

 

ప్రియమైన వారలారా! దేవుని కొరకు మనం పడే ప్రయాస అయిన శ్రమ అయినా సరే అవి ఏ ఒక్కరోజు వృధా కాదు. ఆ నాడు యున్ యేసుక్రీస్తు కొరకు రక్తం చిందించాడు. క్రీస్తు తరువాత స్టెఫను మొదట దేవుని కొరకు హత సాక్షిగా మరణించాడు.ఈనాడు మనం దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఏం చెయ్యబోతున్నాం? అనే విషయాన్ని ఆలోచించి నడుచు కొందాం. హల్లెలుయా!

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు

 

ప్రార్థన అంశం:-

రాగ్ ల్యాండ్ శిక్షణ కేంద్రం మూలముగా అనేకమైన వేలకొలది మిషనరీలు అభివృద్ధి చెందేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino