Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.09.2022
Share:

By Village Missionary Movement

Friday, 09-Sep-2022

దిన ధ్యానము(Telugu) 10.09.2022

 

అంశం:- జీవింపజేసే దేవుడు.

 

"దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" - యోహాను 10:10

 

నేటి కాలంలో మనుష్యులలో సహనం తగ్గిపోతుంది. సమస్తము తాము అనుకున్న విధముగా జరగాలి అనే ఆలోచనలు ప్రబలుతున్నాయి. ఇందు వలన యవ్వనులు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకొంటున్నారు అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. దీని అంతటికీ ముఖ్యకారణం ప్రజల యొక్క అజ్ఞానం. మరియు జీవితము ఇచ్చిన రక్షకుని గూర్చి తెలియక పోవడమే. ఈ లోకంలో ఎటువంటి సవాళ్ళను అయిన జయించే శక్తి యేసుక్రీస్తు అనే నామమునకు మాత్రమే ఉన్నది. ఆయనే మరణాన్ని జయించారు అనే వార్త ప్రకటింపబడాలి. ఆయన నామాన్ని ప్రతి నాలుక ఒప్పుకొని ఆయన ముందు ప్రతి మోకాళ్ళు ఒంగాలి. కాబట్టి ఆత్మహత్య అనే ఆలోచనతో పీడింపబడిన వారికి పైన చెప్పబడిన వాక్యం యొక్క 

 

ప్రత్యేక్షత తెలుపబడాలి. ఆత్మహత్య అనే తీర్మానానికి గల కారణాలు 

1. ఆశించేవి నెరవేరక పోవడం. 

2. ప్రతి పక్షం ఏర్పడుతుంది అనే భయం. 

3. కోరికలు నెరవేరక పోవడం. 

4. యదార్థముగా ఎదుర్కొనుటకు వెనుకాడటం.

5. భవిష్యత్తు మరియు భవిష్యత్తులో ఎదుర్కొన వలసిన సవాళ్ళను గూర్చిన భయం.

 

సైకాలజీ పరిశోధనలో ఇటువంటి ప్రతికూల ఆలోచనలకు మూడు కారణాలు తెలుపబడ్డాయి. 

1. భయం లేదా భయం యొక్క భావన. 

2. ఒత్తిడి లేదా వైకల్యం.

3. సమస్యలను ఎదుర్కొన లేక పారిపోవడం వంటివి.

 

ప్రపంచంలో ఎంతోమంది భయంతో నిండిన సవాళ్ళను, పరిస్థితులను ఎదుర్కొన్నవారు వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేసిన వారు భయానక పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించారు. వారి ప్రతికూల ఆలోచనల వెనుక పరిగెత్తి ఉంటే ఈనాడు అనేక మంది సాధకులు రికార్డులు సంపాదించి వుండే వారు కాదు. ఈ లోకంలో జీవించిన తరువాత మనం శాశ్వతంగా జీవించ వలసిన ఇంకొక ఇంటిలో మనం చోటు సంపాదించుకోవాలి అనేదే మనస్సులో పెట్టుకొని దేవుని బలముతో పరిగెత్తి నప్పుడు ఈ ఆత్మహత్య అనే ఆలోచన తొలగిపోతుంది. పైన చెప్పబడిన వాక్యం ప్రకారముగా దొంగ అయిన సాతాను దొంగతనమును హత్యను, నాశనము చేయుటకే వచ్చును. కాబట్టి ఆత్మహత్య అనే ఆలోచన కలుగజేస్తున్నాడు. విలువైన ఆత్మలను నరకానికి గురి చేస్తున్నాడు. అందువలన అపవాది తంత్రములను ఎదురురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని జీవించాలి. మనుష్యులలో జీవాత్మను ఊదిన వాడు జీవితమునునిచ్చుటకు వచ్చిన వాడు మనలను మన తరం వారిని పరిపూర్ణ జీవితమును జీవింప జేసీ నిత్య జీవమునకు వారసులుగా జేయులాగున ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం అయిన ఈనాడు ప్రార్ధించడం మన బాధ్యత కాదా!

- శ్రీమతి. మెర్సీ జెస్సింద్ర గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి జిల్లాలో 100 ఎస్తేరు ప్రార్థన కూటములు లేచులాగున ప్రార్దిద్దాం..

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet radissonbet nesinecasino betbey cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/