Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.09.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 12-Sep-2022

దిన ధ్యానము(Telugu) 12.09.2022 (Youth Special)

 

అంశం:- దేబోరా లెమ్ము.

 

యవ్వనులు కోరకు ప్రత్యేకమైన సందేశం.

 

“నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను” - యెషయా 60:1

 

ఈ దేబోరా ఎవరు? ఈమె ఇశ్రాయేలీయులకు మొట్ట మొదట న్యాయాధిపతి. సాధారణముగా స్త్రీలు చాలా సాఫ్ట్, ఎమోషనల్ గా వీక్ అంటారు. పరిశుద్ధ గ్రంధంలో కూడా స్త్రీ బలహీనమైన ఘట్టం అని చెప్పబడి ఉన్నది. కాని ఇదే సమయంలో దేబోరా వంటి దైర్యం కలిగిన స్త్రీలు కూడా మనం చూడ గలం. న్యాయాది పతులు 4వ అధ్యాయం 6-9 వచనాల్లో మనం చదివినప్పుడు బారకునకు యెహోవా యుద్దమునకు వెళ్ళమని యెహోవా చెప్పిన సంగతిని దేబోరా అతనికి గుర్తు చేస్తుంది. అప్పుడు బారకు నీవు నాతో కూడా వస్తేనే నేను వెళ్ళెదను నీవు నాతో కుడా రాని యెడల నేను వెళ్ళను అని ఆమెతో చెప్పెను. ఇది చదివినప్పుడు దేబోరా యొక్క ధైర్యమును ఆత్మ విశ్వాసమును మనం అర్ధం చేసుకోవచ్చు. ఈనాడు దీనిని చదువుతున్న ప్రతి ఒక్క స్త్రీని మరియు యవ్వనురాలను ఉత్సాహ పరచాలి అని నేను ఆశపడుతున్నాను. అపజయాన్ని చూసి బయపడి కూర్చోవడానికి మనం పిలువబడలేదు. ప్రభువు మనకు ఇచ్చిన కొంచం బలముతో లేచి తేజరిల్లుటకు మనం పిలువబడ్డాము. మీరు కొన్ని పరిస్థితులు ఎదుర్కొనుటకు మీకు బలం లేదు అనుకొని కృంగిపోయి ఉండవచ్చు. దేవుడు మార్చలేని పరిస్థితులు ఒక్కటి కూడా లేవు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుడు. మీరు చెయ్యవలసినది ఒకే ఒక్కటి. మీ పరిస్థితి ఎలా ఉన్నా అందులో దేవుడు కార్యం జరిగించుటకు చోటివ్వండి. మీరు కూడా దేబోరా వలె లేచి ప్రకాశించాలి అని దేవుడు ఆశ పడుతున్నారు. దేబోరా నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందులో 

 

1. ఆమె యెహోవాను బలముగా కలిగి ఉంది. 

2. ఒక స్త్రీగా న్యాయం తీర్చడమే దేబోరా యొక్క పని కాదు ఆమె ఒక కుమార్తె వలె ఒక భార్య వలె ఒక తల్లి వలె ఇలా చాలా బాధ్యతలను సమర్థ వంతంగా చేసింది. 

 

ఈ యవ్వన కాలంలో మీరు యేసయ్యను పట్టుకొన్నట్లయితే మీ సంతతికి అది ఆశీర్వాద కరముగ ఉంటుంది. నా వల్ల కాదు అని అనుకొంటున్న నీ ద్వారా దేశాన్ని కదిలించాలి అని దేవుడు ఆశ పడుతున్నారు. మరచిపోవద్దు. కాబట్టి దేబోరా వలె లేచి తేజరిల్లాలి అని దేవుని చేతిలో మిమ్మును సమర్పించుకొనండి. ఆయన మిమ్మును ఆశ్చర్యకరముగ నడిపిస్తారు. హల్లెలుయా! 

- శ్రీమతి.దివ్య ఫెర్నర్డ్ గారు

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్య మూలముగా ప్రచురించ బడుతున్న ప్రతి ఒక్క పత్రిక ప్రయోజన కరముగ ఉపయోగ పడేలా ప్రార్దిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/ çarkbet çarkbet giriş