Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.09.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 13-Sep-2022

దిన ధ్యానము(Telugu) 14.09.2022

 

అంశం:- ధర్మశాస్త్రమే నాకు ఆనందం.

 

"సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును" - సామెతలు 15:13

 

దేవుని ధర్మశాస్త్రము ను ప్రేమించి చదివి దివారాత్రము ధ్యానించి ఆయన మాటలకు లోబడి జీవించిన దేవుని పిల్లలను దేవుడు ప్రతి రోజు పరిశుద్ధ పరుస్తారు. దేవుడు తన ముఖ ప్రకాశమును తన పిల్లలకు అనుగ్రహించి సంతోషంగా జీవింప జేస్తారు. మన హృదయం అంతా దేవుని మాటలతో నిండి ఉన్నప్పుడు ఆయన తన స్వరూపాన్ని మనకు అనుగ్రహిస్తారు. 

 

ఒకసారి అమెరికా అధ్యక్షుడు అయిన థామస్ జెఫర్ సన్ తన స్నేహితులతో కలిసి దేశ పర్యాటనకు వెళ్ళాడు. ఆ రాత్రి కురిసిన భారీ వర్షం వలన అడివిని దాటుటకు వేసిన ఒక చెక్క వంతెన ఆ వర్షం నీటిలో కొట్టుకుపోయింది. తన గుర్రాలతో ఆ వంతెనను దాటాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అధ్యక్షుడితో అయ్యా నా దగ్గర గుర్రం లేదు దయచేసి నన్ను మీతో తీసుకొని వెళతారా అని అడిగాడు. అందుకు ఆ అధ్యక్షుడు ఆ వ్యక్తిని తన గుర్రం పైన ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాడు. అప్పడు అక్కడ ఉన్న అధ్యకుని యొక్క స్నేహితులు ఇక్కడ ఇంత మంది ఉండగా నీవు అధ్యక్షుని సహాయం అడుగుటకు నీకు ఎంత ధైర్యం అన్నారు. ఆయన అధ్యక్షుడు అని నాకు తెలియదు కాని మీ యొద్ద లేని ప్రేమ, మరియు సహాయం చేసే మనస్సు కలిగి ఉన్న అతని యొక్క ముఖ ప్రకాశమే నన్ను సహాయం కోరేలా చేసింది అన్నాడు. 

 

అవును ప్రియమైన వారలారా! దేవున్ని ప్రేమించి ఆయన వాక్కు ప్రకారం జీవిస్తున్న దేవుని పిల్లలకు ఆయనలో ఉన్న ప్రేమ , సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దాయాళుత్వము, మంచితనము, విశ్వాసము,.సాత్వీకమును, ఆశా నిగ్రహమును అనుగ్రహిస్తారు. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక యుందును అని ఆయనతో కలిసి మన జీవితంలో ఇతరులకు యేసుని చూపిద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన సంతోషము, ఉల్లాసము మన శరీరము మరియు మనస్సుతో మంచిగా జీవిద్దాం. మంచి మనస్సు కలిగి మంచి క్రియలు చేద్దాం. దేవుడు మనలను పరిశుద్ధ పరిచి వాడుకొనును గాక! పరిశుద్ధ గ్రంథమును ప్రేమిద్దాం, చదువుదాం. అదే మన శ్వాసగా మారును గాక!

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి రాష్ర్టంలో 3000 మంది ప్రార్థన నాయకుల సమూహాలు మరియు ప్రార్థనా సమూహాలు లేచులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş