Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.09.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 18-Sep-2022

దిన ధ్యానము(Telugu) 17.09.2022 (Kids Special)

 

అంశం:- ఎలుక యొక్క చిలిపి చేష్టలు.

 

"పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది" - కొలస్సీయులకు 3:20

 

హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక కథ వినబోతున్నాం. సరేనా!

 

ఒక ఎలుక తన పిల్లలతో కలసి ఇంటి ప్రక్కన ఉన్న సందులో.నివసిస్తుంది. ఎలుకలు ఇంట్లోకి వస్తే ఆ బాధలు భరించ లేము కదా. టమాటాలు, బంగాళా దుంపలు, బియ్యం బస్తా వంటి వాటిని విడిచి పెట్టవు. వాటినే కాదు మనం వేసుకొనే బట్టలను కరిచి నాశనం చేసేస్తాయి. ఏంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఎలుకల బాధను భరించలేక పోతున్నారా? సరే సరే రండి ఈ ఎలుకల నుండి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. అమ్మ ఎలుక తన మూడు ఎలుక పిల్లలకు మంచి ఆహారం ఇచ్చి చక్కగా చూసుకొంటుంది. ఈ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లకూడదు వెళ్తే ఈ మీసాలోడు పట్టుకొని మిమ్మల్ని చంపేస్తాడు అని తన పిల్లలకు చెప్పింది. సరే అమ్మ అని ఆ మూడు ఎలుక పిల్లలు చెప్పాయి. అమ్మ బయటకు వెళ్లిన తరువాత అల్లరి ఎలుక పిల్ల ఒకటి ఆ ద్వారం నుండి బయటకు తొంగి చూసింది. ఆహా అందమైన వెలుగు ఈ ఇల్లు చూడటానికి ఎంత అందంగా ఉంది. ఈ ఇంట్లోనికి వెళ్తే చాలా బాగుంటుంది అని గుడుగుడు మని పరిగెత్తుకొని బయటకు వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేరు సోఫా సెట్ చాలా బాగుంది లైట్ ను ఫ్యాన్ ను చూసి చాలా ఆశ్చర్య పోయింది. అసలే మీసాలోడు ఉన్నాడు అని అమ్మ చెప్పింది కాబట్టి తిరిగి సందులోనికి వెళ్లిపోదాం అనుకున్న ఆ ఎలుక పిల్లకు ఎండిన చేపల వాసన వచ్చింది దాంతో కిచెన్ వైపు తొంగి చూసింది. వావ్ నా కొరకే భోజనం రెడీ చేసి ఉంచారు అనుకొని కడుపు నిండా తినేసింది. హఠాత్తుగా టాప్ మని ఒక శబ్దం వినిపించింది. తలుపు తెరచి లోపలకి ఆ ఇంటి యజమాని వస్తున్నాడు అయ్యో ఎంత పెద్ద మీసం. నేను ఈ మీసం అంతా కూడా లేను ఎలా తప్పించు కోవాలి అని బయపడి అక్కడ నుండి పరిగెత్తింది. కిటికీలు అన్నీ మూసివేసి మీసాలోడు నడుచుకొని రావడం చూసి ఈరోజు నా పని అయిపోయింది అనుకొని తప్పించు కొనుటకు దారి లేదా అనుకొని ఏడుస్తున్న ఎలుక పిల్లకు కుళాయికి ఉన్న ఒక చిన్న రంద్రం కనిపించింది. వెంటనే దానిలోనికి వెళ్లి అమ్మయ్య ఇక పై అమ్మ మాట విని మంచి పిల్లల ఉంటాను అని ఊపిరి పీల్చుకుంది. 

 

ప్రియమైన పిల్లాలారా! అమ్మ మాట వినకపోవడం వలన ఆ ఎలుక పిల్లకు ప్రమాదం వచ్చింది. కధ ను విన్నారు కదా మరి మీ మేలుకోసం చెప్పే తల్లిదండ్రుల మాటలను త్రోసి వేయకూడదు. మీ విధేయతే ఆశీర్వాదమునకు దారి తీస్తుంది. ఏంటి. పిల్లలు అమ్మ నాన్న మాటలు వినడానికి రెడీయేనా. సరే పిల్లలు మనం ఒక కంఠత వాక్యం నేర్చుకొందమా? 

- శ్రీమతి. అన్బు జ్యొతి స్టాలిన్ గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al superbetin pashagaming jojobet jojobet giriş holiganbet instagram unban service instagram unban service