Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.09.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 18-Sep-2022

దిన ధ్యానము(Telugu) 19.09.2022 (Youth Special)

 

అంశం:- నీవు పవిత్రురాలివి.

 

యవ్వనుల కొరకు ప్రత్యేకమైన సందేశం.

 

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" - సామెతలు 28:13

 

తనపై తానే నేరం మోపుకొనుటను సాఫ్ట్ కండమ్ నేషన్ అని అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇందువలన మీరు సంతోషంగా ఉండరు అలానే మీతో ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. యేసయ్య మీకు ఇచ్చిన విడుదల గ్రహించ కుండా, అనుభవించ కుండా సాతాను ఉపయోగించే మోసపూరితమైన ఆయుధమే ఈ సాఫ్ట్ కండమ్ నేషన్. 

 

యేషయా గ్రంధం 43: 25లో నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెబుతున్నారు. నీవు ఎంత పెద్ద తప్పు చేసినా సరే యేసయ్య యొద్ద నిజాయితీగా క్షమాపణ అడిగి మారుమనస్సు పొందుకొంటే ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేసిన పాపము వలన నేను బ్రతకడం వ్యర్థం అని ఆలోచిస్తూ కృంగిపోతే యేసయ్య బెస్ట్ గా ఉంచిన నీ జీవితాన్ని మిస్ అయిపోతావు. 

 

పరిశుద్ధ గ్రంధంలో సమ్సోను గురించి మనం చదువుతున్నాం. అతడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు అభిషేకమును కోల్పోయినప్పుడు కూడా మరలా ప్రభువు యొద్ద తనను సమర్పించు కొని పాపములు క్షమించమని అడిగి సరెండర్ అయ్యాడు. అప్పుడు ఆయన కోల్పోయిన అభిషేకమును మరల పొందుకొని మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవిత కాలములో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయెను అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. మనకు గ్రద్ద బాగా తెలుసు తుఫాను వచ్చినప్పుడు ఇతర పక్షులు భయపడి ఎగిరిపోతాయి అంట కాని ఈ గ్రద్ద మాత్రం ఆ తుఫాను గాలిని ఉపయోగించి ఇంకా పైకి ఎగురుటకు ప్రయత్నం చేస్తుంది అంట. ఈ గ్రద్ద తనకు తానే వేస్ట్ అనుకొన కుండా నేను ఎగుర గలను అనే నమ్మకంతో ఆ తుఫానును ఒక అవకాశంగా చేసుకొని ఇంకా పైకి ఎగురుటకు ప్రయత్నం చేసిన విధముగా మీ జీవితంలో కూడా ఏ పాపం అయిన ఎటువంటి పరిస్థితి అయిన మిమ్మును మీరే వేస్ట్ అనుకొనేలా చేసినా సరే దేవుని సన్నిధికి వెళ్లి క్షమాపణ అడిగి మారు మనస్సు పొందుకొన్నప్పుడు ఏ కార్యం అయినా సులువుగా ఎదుర్కొనేలా యేసయ్య తన కృపను దయ చేస్తారు. నెగిటివ్ పాజిటివ్ గా మార్చుటకు ప్రభువైన యేసు శక్తిమంతుడై యున్నారు. మీరు వేస్ట్ దేనికి పనికిరారు అని అపవాది చెప్పే అబద్దమును మీరు నమ్మ వద్దు. మీరు రారాజు యొక్క ముద్దు బిడ్డలు. ప్రభువు మిమ్మును హెచ్చించి అనేక మందికి ఆశీర్వాద కరమైన పాత్రగా మార్చుతారు. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయ గలను అని సమర్పించు కొని మీ పైన. మీరే నేరము మోపుకొనే స్థితినుండి బయటకు వచ్చి ప్రభువు వలె నేరము లేని జీవితం జీవించి అభివృద్ధి చెందాలి అని ఆశిస్తున్నాను. హల్లెలుయా!

- శ్రీమతి. దివ్య ఫెర్నర్డ్ గారు

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనుల యొక్క అవసరతలు సందించ బడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet